తొలిరోజే తడబడి | - | Sakshi
Sakshi News home page

తొలిరోజే తడబడి

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

సీఎం సొంత జిల్లాలోనే అస్తవ్యస్తంగా పాఠశాలల పునఃప్రారంభం తొలిరోజు అందని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రకిట్లు గత ప్రభుత్వంలో మొదటి రోజే విద్యాకానుక కిట్లు పంపిణీ నేడు పాఠశాలల పునఃప్రారంభం

సీఎం సొంత జిల్లాలో విద్యావవస్థ పరిస్థితి రోజు రోజుకూ దిగజారు తోంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై, పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటి రోజే జిల్లా విద్యాశాఖకు పూర్తి స్థాయి డీఈవో లేకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. పాఠశాలలు తెరి చే అత్యంత కీలకమైన రోజున, జిల్లాలో స్కూళ్లు, విద్యార్థుల సమస్యలను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారే లేకపోవడంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు పెద వి విరుస్తున్నాయి. మే ఆఖరికి గత డీఈవో రాజేంద్ర ప్రసాద్‌ ఉద్యోగ విరమణ పొందారు. ఇప్పటికి 11 రోజులు అవుతున్నా జిల్లాకు రెగ్యులర్‌ డీఈవోను నియమించ లేని దుస్థితికి కూటమి సర్కారు చేరింది.

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా 2047 పాఠశాలల్లో 1,40,666 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థుల శ్రేయస్సుకు జగనన్న విద్యాకానుక పథకం అమ లు చేశారు. ఈ పథకం పేరును మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్రగా పథకం పేరు మార్చింది. అయితే పేరు మార్చడంలో చూపించిన శ్రద్ధ ..కిట్ల ను పాఠశాలలకు చేరవేయడంలో ప్రదర్శించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు దుమ్మెత్తిపోస్తున్నా రు. మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ పేరు పెట్టి మొదటి రోజునే విద్యార్థులను ఖాళీ చేతులతో కూ ర్చోబెట్టడం ఆ మహానుభావుడి పేరుకు మచ్చ తెచ్చేలా ఉందని విద్యావేత్తలు మండిపడుతున్నారు.

ఏ ఒక్క పాఠశాలకు పూర్తి స్థాయిలో చేరని కిట్లు

జిల్లాలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంతో పాటు మిగిలిన ఏ నియోజకవర్గంలోని ఏ ఒక్క పాఠశాలకూ పూర్తి స్థాయిలో కిట్లు చేరని దుస్థితి. జిల్లాలో పాఠశాలలు శుక్రవారం పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఏ ఒక్క పాఠశాలకూ పూర్తి స్థాయిలో విద్యార్థి మిత్ర కిట్లు అందలేదు. కొన్ని చోట్ల కేవలం పాఠ్యపుస్తకా లు వస్తే, యూనిఫాం రాలేదు...మరికొన్ని చోట్ల బ్యాగులు ఉంటే, షూస్‌ లేవు. అసలు మెజారిటీ పాఠశాలల్లో కిట్ల ఊసే లేకుండా పోయింది. సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆందోళనలో తల్లిదండ్రులు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాల తెరిచిన తొలిరోజే విద్యార్థులు సరికొత్త యూనిఫామ్‌లు, సరికొత్త బ్యాగులతో ఎంతో ఉత్సాహంగా బడికి వెళ్లేవారు. కానీ నేడు పాత దుస్తులతో చిరిగిన బ్యాగులతో తొలిరోజు పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తును మార్చేలా సకాలంలో విద్యాసామగ్రిని అందించాలి. మొదటి రోజే కిట్లు ఇవ్వకపోతే పేద పిల్లలు చదువుపై ఎలా శ్రద్ధ పెడతారు? అని ఓ విద్యార్థి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు పక్కనబెట్టి, యుద్ధప్రాతిపదికన విద్యార్థులందరికీ కిట్లు అందేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు.

పర్యవేక్షించే జిల్లా విద్యాధికారి లేకపోవడం

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల వివరాలు

విద్యాసామగ్రి అందాల్సిన చేరినవి

పేరు సంఖ్య

యూనిఫాం 1,40,012 20,618

షూలు 1,40,012 ఒక్కటీ రాలేదు

బ్యాగ్‌లు 14,001 ఒక్కటీ రాలేదు

నోట్‌బుక్స్‌ 7,90,187 7,03,329

వర్క్‌బుక్స్‌ 7,90,187 ఒక్కటీ రాలేదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement