నిరుద్యోగ భృతి భ్రాంతి! | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ భృతి భ్రాంతి!

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

ఒక్కరికే తల్లికి వందనం

ఈమె పేరు వెంకటమ్మ. వత్తలూరు గ్రామం, పుల్లంపేట మండలం. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి లో ఒకరికి మాత్రమే తల్లికి వందనం వచ్చింది. ఇంకొకరికి రావడం లేదు. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఇద్దరికీ ఇవ్వాలి కదా..!. వచ్చే ఒక దానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఫింగర్‌ వేయాలంటే తీసుకోవడం లేదు. తల్లికి వందనం రాదంటున్నారు. ప్రతి ఏడాదీ నేరుగా అకౌంట్‌లో వేయాలి కానీ ఇలాంటి తరకాసులు పెట్టకూడదు.

ఉత్త గ్యాస్‌ మాటలే!

ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు సాలమ్మ. రామంద్రాపురం మండలం, రేఖలచేను గ్రామం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సూపర్‌సిక్స్‌ హామీల్లో ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితమని చెప్పారు. దీంతో ఈమె గ్యాస్‌ కనెక్షన్‌ నంబరు: 7055675602తో దరఖాస్తు చేసుకుంది. రెండేళ్ల చంద్రబాబు పాలనలో ఇప్పటి వరకు సాలమ్మకు ఎలాంటి గ్యాస్‌ సబ్సిడీ లభించలేదు. తనను అర్హురాలిగా గుర్తించాలంటూ పలుమార్లు గ్యాస్‌ ఏజెన్సీలు, రెవెన్యూ అధికారులకు అర్జీలిచ్చినా ఫలితం లేకుండా పోయింది.

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు లలిత్‌. ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నాడు. బెంగళూరులో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ప్రతి నెలా హాస్టల్‌ ఫీజు, మెస్‌ చార్జీలు, స్టడీ మెటీరియల్స్‌ కోసం దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుపెడుతున్నాడు. మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తారని ఆశ పడ్డాడు. భృతి రూ.3 వేలు వస్తే కాస్త సహాయం కలిగేదని, ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు కదా అమలు చేస్తే పుస్తకాలకై నా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. అయితే రెండేళ్లుగా ప్రకటనలకే పరిమితం చేసి, మోసం చేశారని విమర్శలు గుప్పిస్తున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement