ప్రభుత్వ కార్యాలయంలో టీడీపీ కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యాలయంలో టీడీపీ కార్యక్రమం

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం టీడీపీ కార్యాలయంలా మారింది. బుధవారం ఇక్కడ టీడీపీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లతో సర్‌పై జీడీ నెల్లూరు ఆ పార్టీ ఎమ్మెల్యే థామస్‌ సమావేశం ఏర్పాటు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా టీడీపీ కార్యక్రమం నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే థామస్‌ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏక వచనంతో పలుమార్లు సంబోధించారు. దీనిపై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటివి అనవసర వ్యాఖ్యలని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండి, క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 83,812 మంది స్వామిని దర్శించుకున్నారు. 38,345 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement