అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

● మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక ● పెండింగులో ఉన్న దరఖాస్తులకు సత్వర పరిష్కారం

చిత్తూరు కలెక్టరేట్‌ :జిల్లాలో అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ, ఎకై ్సజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన బుధవా రం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో క్వారీల్లో నెలకొన్న సమస్యలను సత్వరం పరిష్కరిస్తామన్నారు. అక్రమంగా సాగిస్తున్న మైనింగ్‌ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర మైనింగ్‌ ఆదాయం సుమారు రూ.3 వేల కోట్లకు చేరి, 40 శాతం వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌, లైమ్‌ స్టోన్‌, ఐరన్‌ ఓర్‌, బీచ్‌ శాండ్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 12 బ్లాక్‌లను గుర్తించి దశలవారీగా వేలం వేశామన్నారు. జిల్లాలో 682 మైనింగ్‌ లీజులు ఉండగా, ప్రస్తుతం 50 శాతం మాత్రమే నడుస్తున్నాయన్నారు. 500 నుంచి 600 వరకు ఉన్న ఖనిజ ఆధారిత పరిశ్రమల్లో అనేకం మూతపడ్డాయన్నారు. వీటి సమస్యల అధ్యయనానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కలర్‌ గ్రానైట్‌ రంగంలో రాయల్టీ సమస్యలతో నష్టపోతున్న పరిశ్రమలను ఆదుకుంటామ ని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల విధానాలను పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందిస్తామని హామీ ఇచ్చా రు. వడ్డెర సహకార సంఘాలకు 50 శాతం రాయితీతో క్వారీ లీజులు అందించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అటవీ అనుమతు లు, రెవెన్యూ ఎన్‌వోసీల మంజూరులో అడ్డంకులను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌, చుడా చైర్మన్‌ కఠారి హేమలత పాల్గొన్నారు.

గ్రానైట్‌ క్వారీని పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

గుడిపాల: మండలంలోని కుప్పిగానిపల్లె, పశుమంద గ్రామ పరిధిలోని బ్లాక్‌ గ్రానైట్‌ క్వారీని మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. 12 గ్రానైట్‌ క్వారీల హద్దులు, గ్రానైట్‌ బ్లాక్‌ విలువ, క్వారీ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, ఎమ్మెల్యే జగన్‌మోహన్‌, మైన్స్‌ డీడీ సత్యనారాయణ, పలమనేరు ఏడీ ఆనంద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement