కిక్కిరిసిన కాణిపాకం
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో ఉదయం నుంచి ఆలయం కిక్కిరిసింది. ఉచిత దర్శనం మొదలు...శీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శనాల వరకు భక్తులు భారీగా బారులు తీరారు. దర్శ నానికి 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షి స్తూ..రద్దీని అధిగమించేలా ఏర్పాట్లు చేశారు.
నేడు కలెక్టరేట్‌లో
ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక ఉంటుందని చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
నేడు పోలీసు గ్రీవెన్స్
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ప్రజలు నేరుగా తనను కలిసి సమస్యలు తెలిపి పరిష్కరించుకోవాలని సూచించారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.
నేటి నుంచి సమ్మేటీవ్ అసెస్‌మెంట్–1
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో సోమవారం నుంచి సమ్మేటీవ్ అసెస్‌మెంట్–1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 8 నుంచి 10 తరగతులకు ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, 6, 7 తరగతులకు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు పరీక్షలుంటాయని జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
వాలీబాల్ సెమీ ఫైనల్‌కు మూడు రాష్ట్రాల జట్లు
రొంపిచెర్ల: మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో సౌత్ జోన్ లెవల్ వాలీబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జట్లు పోటీ పడుతున్నారు. సెమీ ఫైనల్‌లో తమిళనాడు, నెల్లూరు, హైదరాబాదు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, నంద్యాల, కాకినాడ, సూర్య వేలూరు నవీన్ తమిళనాడు జట్లు చేరారు. వాలీబాల్ పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. రాత్రి 11 గంటలకు పోటీలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పోటీలకు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీలోని పల్లు జిల్లాల నుంచి పెద్ద ఎత్తు న క్రీడాకారులు విచ్చేశారు. డే అండ్ నైట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు నిర్వాహకులు వసతి, భోజన వసతిని కల్పించారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, రౌనఖ్, ఆజమ్, పూర్వ విద్యార్థుల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
కేంద్ర స్కాలర్‌షిప్‌నకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే స్కాలర్‌షిప్‌లకు అవకాశం కల్పించినట్టు సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం బీసీ, ఈబీసీ, డీఎన్‌టీ (సంచారజాతులు) విద్యార్థు లు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (పీఎం యశస్వి) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 15లోగా దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. తల్లిదండ్రు ల వార్షిక ఆదాయం రూ 2.5 లక్షల లోపు, గత ఏడాది మార్కుల జాబితా, బ్యాంకు ఖాతా, ఆధా ర్, కుల ధ్రువీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
కిక్కిరిసిన కాణిపాకం


