నేను పదేళ్లుగా కళత్తూరు పరిసర గ్రామాల్లో చీరలు అమ్ముకుంటూ ఆ వ్యాపారంతో కుటుంబ పోషణ చేసుకుంటున్నా. పది రోజుల క్రితం రూ.70 వేలకు వెంకటగిరిలో చీరలు కొని ఇంట్లో ఉంచా. అందులో రూ.10 వేల విలువైన చీరలను విక్రయించా. అయితే చెరువు తెగి ఒక్క సారిగా వచ్చిన నీటి ప్రవాహానికి ఇంట్లోని చీరలు మొత్తం కొట్టుకుపోయాయి. ఏం చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం ఆదుకుంటే గాని వ్యాపారం చేసుకోలేం.
–సీహెచ్ జ్యోతి మణి
బురదలో నిలబడిపోయాం
నాకు ఓ ప్రమాదంలో చేయి పోయింది. ఇక ఏ పని చేసుకోలేక మూడేళ్ల క్రితం కుటుంబ సభ్యుల సహకారంతో మా కాలనీలోనే మళిగంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అయితే రాయలచెరువు తెగిన ఘటనలో ఉప్పెనలా వచ్చిన నీటి ప్రవాహానికి దుకాణం మునిగిపోయింది. అంలోని పప్పు, ఇతర నిత్యావసర సరుకులు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. చివరకు దుకాణం, ఇంటిలో నిండిపోయిన బురదలో నిలబడిపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – పి.రాజా
ప్రశ్నార్థకంగా జీవనం
నేను రోజువారీ నిర్మాణ పనులకు వెళుతుంటా. కాంక్రీట్ మిల్లరు ద్వారా ఉపాధి పొందుతుంటా. ఇళ్లకు శ్లాబు కాంక్రీట్ పనులకు కూలీలను తీసుకుని వెళతా. పని ఉన్న రోజు మిల్లరుకు రూ.1000 అద్దె వస్తుంది. దాంతో పాటు నాకు కూలి కింద మరో రూ.600 ముట్టుతుంది. అయితే రాయలచెరువు ఘటనతో నీటి ప్రవాహానికి నా ఇంటి ముంగిట పెట్టిన కాంక్రీటు మిల్లర్ కొట్టుకుపోయింది. దీంతో మా కుటుంబ జీవనం ప్రశ్నార్థకంగా మారింది. కాంక్రీటు మిల్లర్ కొత్తది కొనాలంటే రూ.లక్ష కావాలి. రోజు వారీ కూలీగా కుటుంబ పోషణ చేసుకునే నేను ఒక్క సారిగా అంత పెట్టుబడి పెట్టలేని దుస్థితి. ప్రభుత్వం ఆదుకుంటే కానీ, మా బతుకు ముందుకు సాగదు. – కోళ్ల విజయరత్నం
ఏం చేయాలో తెలియడం లేదు
ఏం చేయాలో తెలియడం లేదు


