● వైభవంగా కల్యాణోత్సవం
కాణిపాకం: కార్తీక బహుళ పంచమిని పురస్కరించుకుని కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో సోమ వారం స్వామి వారికి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత మూలస్థానంలోని స్వామికి అభిషేక పూజలు చేసి విశేషంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ప్రత్యేకాభిషేకం చేసి కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తు లు కనులారా కల్యాణోత్సవాన్ని వీక్షించి పునీతులయ్యారు. ఏఈవో రవీంద్రబాబు పాల్గొన్నారు.
మణికంఠేశ్వరస్వామి ఆలయంలో...
కాణిపాకంలోని ప్రధాన ఆయాలనికి అనుబంధ ఆల యమైనా శ్రీ మణికంఠేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక సోమవార పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు దీపారాధన చేసి వ్రతం ఆచారించారు.
● వైభవంగా కల్యాణోత్సవం
● వైభవంగా కల్యాణోత్సవం


