మా మొర ఆలకించండయ్యా!
చిత్తూరు కలెక్టరేట్ : మా మొర ఆలకించండయ్యా.. సమస్యలు పరిష్కరించండయ్యా..! అంటూ వివిధ ప్రాంతాల నుంచి పీజీఆర్‌ఎస్‌కు విచ్చేసిన అర్జీదారు లు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, డీఆర్‌వో మోహన్‌కుమార్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలు నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ సమస్యలపై మొత్తం 301 అర్జీలు అందజేసినట్టు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు.
అర్జీదారుల సమస్యను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్
సచివాలయ సిబ్బందితో అర్జీలు రాయించుకుంటున్న బాధితులు
ఒకే కుటుంబానికి 40 ఎకరాల డీకేటీ భూమి
పాలసముద్రం మండలం, వెంగళ్రాజుకుప్పంలో ఒకే కుటుంబంలో 40 ఎకరాల డీకేటీ భూమి ఉందని వెంగళ్రాజుకుప్పం దళితులు లిల్లి, పుష్పా, సరళ వాపోయారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ వెంగళ్రాజుకుప్పం దళితవాడలో 300 కుటుంబాలున్నాయన్నారు. తమ గ్రామంలో ఎవ్వరికీ భూమి లేదని చెప్పారు. గ్రామస్తులు బతుకుదెరువు కోసం కూలి, పశువులు మేపుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. వెంగళ్రాజుకుప్పం పెద్ద చెరువులో నీరు లేదని తెలిపారు. కొంతమంది చెరువును ఆక్రమించుకుని కంచెలు వేసుకున్నారన్నారు. కనికిలకోన గుడికి పోయే దారిలో ఉన్న భూమిలో పశువులు మేపుకుంటున్నామన్నారు. ఆ భూమిని ప్రస్తుతం రామస్వామిరాజు, గోవిందరాజులు ఆక్రమించుకున్నారన్నారు. వారిద్దరి భూమిలో దారిని ఆక్రమించుకోవడం వల్ల దారి సమస్య ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. డీకేటీ భూమి ఆక్రమణలను పరిశీలించి భూమి లేని దళితులకు పంచిపెట్టాలని కోరారు. గ్రామానికి చెందిన ఓబు, కుప్పయ్య, యేసుప్రసాద్, జాన్, యువరాజ్ పాల్గొన్నారు.
భూ హక్కు పత్రం మంజూరు చేయండి సా రూ..! అంటూ పెద్దపంజాణి మండలం, బట్టందొడ్డి పంచాయతీ, జంగాలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, కుటుంబీకులు వేడుకున్నారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలో సర్వే నం.240లో 3.10 ఎకరాల భూమిలో సాగు చేసుకుంటున్నామన్నారు. వ్యవసాయమే తమకు జీవనాధారమని చెప్పారు. తమ భూమికి సంబంధించి 1 బీ, భూ హక్కు పత్రం మంజూరు చేయాలని కోరారు.
మా మొర ఆలకించండయ్యా!
మా మొర ఆలకించండయ్యా!
మా మొర ఆలకించండయ్యా!
మా మొర ఆలకించండయ్యా!


