వాలీబాల్ విన్నర్ హైదరాబాద్
రొంపిచెర్ల: రొంపిచెర్ల బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన సౌత్ జోన్ లెవల్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ జట్టు విన్నర్స్‌గా నిలిచింది. సెమీ ఫైనల్‌లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జట్లు పోటీ పడ్డాయి. ఆపై కాకినాడ– హైదరాబాద్, పాండిచ్చేరి–ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ జట్లు పోటీపడగా హైదరాబాద్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ జట్లు ఫైనల్స్‌కు చేరాయి. ఫైనల్స్‌లో ఎస్‌ఆర్‌ఎంపై హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. మొదటి బహుమతిగా హైదరాబాద్ జట్టుకు రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ జట్టుకు రూ.30 వేలు, తృతీయ బహుమతిగా కాకినాడ జట్టుకు రూ.20 వేలు, నాల్గవ బహుమతిగా పాండిచ్చేరి నవీన్ జట్టుకు రూ.10 వేలు అందజేశారు. నిర్వాహకులు షబ్బీర్, రౌనఖ్, ఆజమ్, మహ్మద్ సల్మాన్, అన్సర్, పూర్వ విద్యార్థుల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.


