● ఇష్టారాజ్యం
గంగాధరనెల్లూరు మండలంలోని మహాదేవమంగళం పంచాయతీ పరిధిలో వ్యవసాయ శాఖ సంబంధించి విత్తనాభివృద్ధి క్షేత్రం ఉంది. దీనికి దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సదురు భూమిలో ఎలాంటి కార్యకలాపాలు జరగకపోగా మొక్కుబడిగా అప్పుడప్పుడు వేరుశనగ పంట వేస్తుంటారు. మరికొంత భూమిలో సీమ రూప చెట్లు పెట్టారు. ఈ భూమికి ఒక ప్రభుత్వ మహిళ కాపరి ఉండగా, కొందరు అధికారులు ఓ వ్యక్తిని ప్రైవేటుగా నియమించుకున్నారు. కాగా ప్రస్తుతం సదరు భూమిపై అధికార పార్టీకి చెందిన కొందరి నాయకుల కన్ను పడింది. సెలవు దినాలైన రెండో శనివారం, ఆదివారం వస్తే సదరు భూమిలో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వేస్తున్నారు. బంగారెడ్డిపల్లి సమీపంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ పక్కన దారి ఏర్పాటు చేసుకొని దర్జాగా మట్టి తరలిస్తున్నారు. ఇంతజరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. – గంగాధరనెల్లూరు
● ఇష్టారాజ్యం
● ఇష్టారాజ్యం


