కాన్వాయ్ కారణంగా ప్రమాదం జరగలేదు
● మీడియాకు తెలిపిన హేమలత
పుంగనూరు: రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు మండలంలోని చండ్రమాకులపల్లెకి చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం వై.వెంకట్రమణ సోమవారం తెలిపారు. మదనపల్లె జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో చండ్రమాకులపల్లెకి చెందిన పి.గానవి, 8వ తరగతి చెందిన విజయ్, గోవర్ధన్, 7వ తరగతికి చెందిన తేజశ్వని స్టాండ్‌బైగా ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థులు ఈనెల 19 నుంచి 21 వరకు గ్రీన్‌వ్యాల్యు గ్రౌండ్‌లో జరిగే రాష్ట్ర సంకలనంలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థుల ఎంపిక పట్ల హెచ్‌ఎంతో పాటు పీడీ మురళిధర్, ఉపాధ్యాయులు వెంకట్రమణారెడ్డి, మణి, రమణమ్మ, శంకర్‌రెడ్డి, రఘు, ఎస్‌ఎంసీ సభ్యులు అభినందించారు.


