గుండె‘కోత’
జలప్రళయం అన్నదాతకు గుండెకోత మిగిల్చింది. రాయలచెరువు ఆయకట్టు పరిధిలోని రెండు వేల ఎకరాల మేర ధ్వంసమైంది. పాతపాళెం, పాతపా ళెం దళితవాడ, అరుంధతి వాడ, ఎస్.ఎల్.పురం, కళత్తూరు, ఎం.ఏ రాజులకండ్రిగ గ్రామాల్లో పొలా లన్నీ కోతకు గురయ్యాయి. కోతకు గురై రూపురేఖలే మారిపోయాయి. ఇసుక మేటలు వేశాయి. రాళ్లుతేలిపోయాయి. వీటిని బాగు చేయడానికి భారీగా ఖర్చుచేయాల్సి ఉంది. ప్రభుత్వం ఆదుకుంటేనే రైతులను గట్టున పడే అవకాశం ఉంది.
పాతపాళెం ప్రాంతంలో
రాళ్లు తేలిన పంట పొలాలు


