రాష్ట్రంలో అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచక పాలన

Aug 10 2025 5:52 AM | Updated on Aug 10 2025 5:52 AM

రాష్ట

రాష్ట్రంలో అరాచక పాలన

బైరెడ్డిపల్లె : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి తెలిపారు. పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలోని బైరెడ్డిపల్లె సమీపంలో ఉన్న శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం వద్ద శనివారం రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమకేసు నుంచి విముక్తి కలగాలని ఆలయంలో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకొని అరాచకాలు, అక్రమ కేసులతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధిస్తూ ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని ఆరోపించారు. ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, జెడ్పీటీసీ సభ్యులు ఆర్‌.కేశువులు, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి దయానందగౌడు, వైస్‌ ఎంపీపీలు, రూపజయకుమార్‌రెడ్డి, నారాయణస్వామి, మండల యూత్‌ అధ్యక్షుడు మహేష్‌బాబు, సర్పంచులు వెంకటేష్‌, బాలక్రిష్ణగౌడు, రమణారెడ్డి, చంద్రమౌళి, రాజప్ప, ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

ఎంపీ విడుదల కావాలని

రాజనాలబండపై పూజలు

చౌడేపల్లె: అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి విడుదల కావాలని కోరుతూ సత్యప్రమాణాలను నిలయమైన రాజనాలబండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. వెంగళపల్లె ఎంపీటీసీ లక్ష్మీనరసయ్య, వైస్సార్‌సీపీ నేతలు ఓబులేసు, చంద్రశేఖర్‌, శ్రీనివాసులు ఆధ్వర్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పేరిట అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఎన్‌.దామోదరరాజు, మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, మాజీ బోయకొండ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, మిద్దింటి కిషోర్‌బాబు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటరమణ, అమర, సర్పంచులు షంషీర్‌, ఓబుల్‌రెడ్డి, నాగరత్న, ఎంపీటీసీ శ్రీరాములు, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, రమేష్‌బాబు, సాధిక్‌, నాయకులు ఠాణాధార్‌ నాగరాజ, చెంగారెడ్డి, పవన్‌కుమార్‌, బాలాజీ, జీఆర్‌ఎస్‌ రమణ, సుబ్రమణ్యంరాజు, బీ.భాస్కర్‌, వెంకటరెడ్డి, అనుప్రియ, శంకరప్ప, గణేష్‌, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

కూటమికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ

సోమల(చౌడేపల్లె): అక్రమ కేసులో అరెస్టయిన ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కావాలని కోరుతూ సోమలలోని భూనీలాదేవి సమేత పరష వేంకటేశ్వరస్వామి పాదాల గుడి వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టారు. ఎంపీపీ ఈశ్వరయ్య, మండల పార్టీ అధ్యక్షుడు గంగాధర్‌రాయల్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు అమాసమోహన్‌, నాగేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌, వాటర్‌షెడ్‌ చైర్మన్లు పుష్పావతి, డిసెంబరు రావు, సర్పంచులు శీలం సిద్ధులమ్మ, వెంకటరమణ, జయరాం, ఎంపీటీసీ నాగభూషణరెడ్డి, నాయకులు శీలం భాస్కర్‌, సాంబశివయ్య, వరదం రమణ, ఐలా శంకర, శ్రీరాములు, సుబ్రమణ్యం, మురళి, రామాంజులు తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

సదుం: అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విడుదల కోసం మండల కేంద్రానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయనకు వెంటనే బెయిల్‌ మంజూరు కావాలని దువా చేశారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే కూటమి ప్రభుత్వం ఆయనను వేధించేందుకు అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్‌ సీపీ నాయకులను అరెస్టు చేస్తోందన్నారు. మాజీ సర్పంచ్‌ సయ్యద్‌ బాషా, ఖమ్రుద్దీన్‌, ఖాజాపీర్‌, బావాజీ, కాలేషా, మునాఫ్‌, షబ్బీర్‌, ఎంఎం బాషా, అంజాద్‌, సాదిక్‌, చాను, రెడ్డి ముబారక్‌ పాల్గొన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన1
1/2

రాష్ట్రంలో అరాచక పాలన

రాష్ట్రంలో అరాచక పాలన2
2/2

రాష్ట్రంలో అరాచక పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement