చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ పెద్దిరెడ్డి వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 5 వతరగతిలో అడ్మిషన్, 6,7,8 తరగతుల్లో ఖాళీల భర్తీకి ఏపీఆర్‌ఎస్ క్యాట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్‌లకు ఏపీఆర్‌జేసీ, డిగ్రీలో ప్రవేశానికి ఏపీఆర్‌డీసీ సెట్ జరుగుతుందని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు www. aprs. apcfss. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్
చిత్తూరు కలెక్టరేట్ : రాబోయే సార్వత్రిక ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా గుర్తించిన సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మొత్తం 1,762 పోలింగ్ కేంద్రాలకు గాను 415 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.