జొమాటో కొత్త ఫీచర్‌.. దీపిందర్‌ వీకెండ్‌ అప్‌డేట్‌ | Zomato new feature Deepinder Goyal weekend update | Sakshi
Sakshi News home page

జొమాటో కొత్త ఫీచర్‌.. దీపిందర్‌ వీకెండ్‌ అప్‌డేట్‌

Aug 17 2024 9:28 PM | Updated on Aug 17 2024 9:28 PM

Zomato new feature Deepinder Goyal weekend update

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఎక్కువ మంది ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులు ఫుడ్‌ ఆర్డర్‌ చేసేటప్పుడు ఒకే ఫోన్‌ను మార్చుకునే ఇబ్బంది లేకుండా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు జొమాటో ఫౌండర్‌, సీఈవో దీపిందర్‌ గోయల్‌ తెలిపారు.

ఈ కొత్త ఫీచర్‌ని 'గ్రూప్ ఆర్డరింగ్' అని పిలుస్తారు. ఫుడ్‌ ఆర్డర్‌ చేసేటప్పుడు యూజర్లు తమ స్నేహితులకు లింక్‌లను షేర్‌ చేయడాని​కి ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా వారు తమకు నచ్చిన వంటకాల జాబితాను సలువుగా జోడించవచ్చు. దీంతో ఫుడ్‌ ఆర్డర్ చేయడం మరింత వేగవంతమవుతుంది.

దీపిందర్‌ గోయల్‌ వీకెండ్‌ అప్‌డేట్‌ పేరుతో ‘ఎ‍క్స్‌’ (ట్విటర్‌)లో ఈ కొత్త ఫీచర్‌ గురించి తెలియజేశారు. ఈ చేసిన ఈ పోస్ట్‌కు లక్షకు పైగా వ్యూస్‌, వేలాదిగా  లైక్‌లు వచ్చాయి. యూజర్లు మిశ్రమ కామెంట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement