
జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ గురుగ్రామ్లో రూ.కోట్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.డీఎల్ఎఫ్కు చెందిన ది కామెలియాస్లో అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ను మూడేళ్ల క్రితం రూ.52.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు జాప్కీకి లభించిన డాక్యుమెంట్లు చెబుతున్నాయి.
మార్చిలో కన్వెన్షన్ డీడ్ ను చేసుకున్నారని, స్టాంప్ డ్యూటీ కింద గోయల్ రూ.3.66 కోట్లు చెల్లించారని డాక్యుమెంట్లు చెబుతున్నాయి. 10,813 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్ మెంట్ లో ఐదు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ నుంచి 2022 ఆగస్టులో ఈ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారని, 2025 మార్చి 17న కన్వెన్షన్ డీడ్ రిజిస్టర్ అయిందని డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.
గురుగ్రామ్లో డీఎల్ఎఫ్ ఫేజ్ -5 లో ఉన్న కామెలియాస్లో అన్నీ అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లే. దీపిందర్ గోయల్ మూడేళ్ల క్రితం కొన్న లాంటి అపార్ట్ మెంట్ ఇప్పుడు కొనాలంటే రూ.140 కోట్లకు పైగా ఖర్చవుతుందని రియల్టీ బ్రోకర్లు చెబుతన్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో దీపిందర్ గోయల్‌కు మరో ప్రాపర్టీ కూడా ఉంది. 2024 ఫిబ్రవరిలో గోయల్ ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో రూ .50 కోట్లకు ఒక ప్లాట్ను కొనుగోలు చేశారు.