Mi 11X Pro: షావోమి అదిరిపోయే ఆఫర్‌..సగానికి సగం ధరకే ఫోన్లు

Xiaomi India Exchange Offer Mi 11x Pro 5g With 8gb Plus 128gb - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం షావోమీ బంపర్‌ ఆఫర్లు ప్రకటించింది. పలు బ్రాండెడ్‌ ఫోన్లను ఎక్ఛేంజ్‌ ఆఫర్‌తో సగానికి పైగా తక్కువ ధరకే లభించేలా ఆఫర్లు అమలు చేస్తోంది. సుమారు రూ.40వేల ఖరీదైన ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్  8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌పై అన్ని రకాల రాయితీలు వర్తిస్తే కేవలం రూ. 12, 849కే  సొంతం చేసుకోవచ్చు.  

ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్  ఫీచర్లు
6.67 అంగుళాల ఫుల్ హెచ్‌ హెచ్‌డీ  అమోలెడ్‌ డిస్‌ప్లే 4,520ఎంఏహెచ్ బ్యాటరీ,క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రేర్‌ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్ శాంసంగ్‌  హెచ్ఎం2 సెన్సార్,  8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్లు ఉండగా ..కెమెరా వెనుక భాగంలో ఉన్న 3కెమెరాలకు 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను సెలెస్టియల్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, లూనార్ వైట్ కలర్స్‌తో అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఫోన్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 

ఆఫర్లు ఇలా ఉన్నాయి 
దేశంలో ఫెస్టివల్‌ సీజన్‌లో ఈకామర్స్‌ కంపెనీ అమెజాన్‌ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' పేరుతో భారీ ఆఫర్లను అందిస్తుంది. ఇందులో భాగంగా షావోమీ ఇండియా 8జీబీ ర్యామ్ ప‍్లస్‌ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్ ప్లస్‌ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్లపై డిస్కౌంట‍్లను ప్రకటించింది.

ఈ ఫోన్‌ ధరల విషయానికొస్తే 8జీబీ ర్యామ్ ప్లస్‌ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 ఉంది, ఈ మోడల్‌పై  ఎక్సేంజీ ఆఫర్‌లో గరిష్టంగా రూ.25,250లను షావోమీ  ఆఫర్‌ చేస్తోంది. మీ పాత మొబైల్‌ ఫోన్‌కి ఎక్సేంజీలో మ్యాగ్జిమమ్‌ అమౌంట్‌ వస్తే ఫోన్‌ ధర రూ.14,249కి వస్తుంది.

అయితే ఇక్కడో మరో ఆఫర్‌ని కూడా పొందే వీలుంది. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్‌/డెబిట్‌ కార్డు చెల్లింపుల ద్వారా గరిష్టంగా మరోసారి రూ. 1,400ల వరకు డిస్కౌంట్‌ని పొందవచ్చు. దీంతో మొబైల్‌  చివరకు రూ.12,849లకే సొంతం చేసుకోవచ్చు.

ఇదే మోడల్‌లో మరో వేరియంట్‌ 8జీబీ ర్యామ్ ప్లస్‌ 256జీబీ స్టోరేజ్‌తో  రూ.41,999గా ధరతో ఉంది. ఈ మొబైల్‌ ఫోన్‌పై గరిష్ట ఎక్సేంజీ రూ.16,250గా ఉంది. దీంతో పాటు ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్‌/డెబిట్‌ కార్డు చెల్లింపుల ద్వారా గరిష్టంగా మరోసారి రూ.1,400ల వరకు డిస్కౌంట్‌ని పొందవచ్చు. అయితే 256 జీబీ వేరియంట్‌తో పోల్చితే 128 వేరియంట్‌ని ఎంపిక చేసుకోవడం ద్వారా తక్కువ మొత్తానికే ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 

చదవండి: Xiaomi Smart Glasses: మాట్లాడేందుకు కళ్ల జోళ్లొస్తున్నాయ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top