వచ్చేశాయి..షావోమీ నయా ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్స్‌...పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌ ఇంకా ఎన్నో..!

Xiaomi 12 Xiaomi 12 Pro Xiaomi 12x With Triple Rear Cameras Launched Globally: Price Specifications - Sakshi

ప్రపంచవ్యాప్తంగా షావోమీ 12  సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ లాంచ్‌ చేసింది. షావోమీ 12, షావోమీ 12 ప్రో, షావోమీ 12ఎక్స్‌ మూడు స్మార్ట్‌ఫోన్స్‌ మొబైల్‌ లవర్స్‌కు అందుబాటులో ఉండనున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో షావోమీ 12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ చైనాలో లాంచ్‌ అయ్యాయి. షావోమీ 12, షావోమీ 12 ప్రో  స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 ఎస్‌వోసీ ప్రాసెసర్‌తో రానున్నాయి, ఇక షావోమీ 12 ఎక్స్‌  స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ అన్నింటిలో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో రానున్నాయి. 

ధర ఎంతంటే..?

  • Xiaomi 12 (8జీబీ ర్యామ్‌ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్) వేరియంట్ కోసం ధర సుమారు 749 డాలర్లు (సుమారు రూ. 57,200) నుంచి ప్రారంభమవుతుంది. 
  • Xiaomi 12 Pro (8జీబీ ర్యామ్‌ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్) వేరియంట్‌ ధర 999 డాలర్ల (సుమారు రూ.76,300) నుంచి  ప్రారంభమవుతుంది. దీనిలో యాపిల్ తన ప్రీమియం ఐఫోన్ మోడల్స్‌లో ఉపయోగించే తక్కువ-ఉష్ణోగ్రత పాలీక్రిస్టలైన్ ఆక్సైడ్ (LTPO) బ్యాక్‌ప్లేన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది.
  • Xiaomi 12X (8జీబీ ర్యామ్‌ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్) వేరియంట్ ధర 649 డాలర్ల (సుమారు రూ. 49,600) నుంచి ప్రారంభమవుతుంది. మూడు స్మార్ట్‌ఫోన్‌లు బ్లూ, గ్రే, పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో  అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇంచుమించు షావోమీ 12 ఫీచర్స్‌ను కల్గి ఉంది. 

షావోమీ 12 ఫీచర్స్‌

  • 6.28-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లే
  • క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్
  • 50 ఎంపీ+13ఎంపీ+5ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • డాల్బీ విజన్ సపోర్ట్‌
  • డ్యూయల్ సిమ్ సపోర్ట్
  • 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌
  • 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌
  • 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
  • USB టైప్-C పోర్ట్

షావోమీ 12 ప్రో ఫీచర్స్‌

  • 6.73-అంగుళాల WQHD+ (1,440x3,200 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లే
  • క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్
  • 50 ఎంపీ+50ఎంపీ+5ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • డాల్బీ విజన్ సపోర్ట్‌
  • డ్యూయల్ సిమ్ సపోర్ట్
  • 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌
  • 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌
  •  10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌
  • 4,600 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
  • USB టైప్-C పోర్ట్

చదవండి: ఐఫోన్‌కు పోటీగా సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌..! అది కూడా బడ్జెట్‌ రేంజ్‌లో

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top