
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి లాంచ్ కానుంది. రిలీజ్ కాకముందే షావోమీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ స్పెషిఫికేషన్లు, ధర నెటింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. షావోమీ 12, షావోమీ 12ఎక్స్, షావోమీ 12 ప్రొ, షావోమీ 12 అల్ట్రా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు డిసెంబర్ 28ను చైనాలో కన్పించాయి. నేడు షావోమీ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్స్‌తో పాటుగా షావోమీ ట్రూ వైరెలెస్ ఇయర్‌ఫోన్స్(టీడబ్ల్యూఎస్)3 కూడా లాంచ్ అవకాశం ఉంది.
టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ రాబోయే షావోమీ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ధరలను ట్విటర్‌లో పంచుకున్నారు . ఏది ఏమైనప్పటికీ, రాబోయే షావోమీ ఫ్లాగ్‌షిప్ సిరీస్ 11 కంటే కొంచెం ఖరీదైనదిగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
షావోమీ 12, షావోమీ 12ఎక్స్, షావోమీ 12 ప్రో ధర
- 8జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ షావోమీ 12 సుమారు చైనాలో 4,299 యువాన్లు (దాదాపు రూ. 50,500)గా ఉంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. 8జీబీ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 4,599 యువాన్లు (దాదాపు రూ. 54,000)గా, అయితే 12జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 (దాదాపు రూ. 58,800)గా ఉన్నట్లు వెల్లడించారు
- షావోమీ 12ఎక్స్ 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,499 యువాన్లు (దాదాపు రూ. 41,100)గా, 8జీబీ + 256ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 3,799 యువాన్లు (దాదాపు రూ. 44,700)గా ఉంది.
- అగర్వాల్ ట్వీట్ ప్రకారం, షావోమీ 12 ప్రో ధరలు 8జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 4,999 యువాన్లుగా (సుమారు రూ. 58,800)గా ఉంది. మరోవైపు, 8జీబీ + 256 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 5,299 యువాన్లు (దాదాపు రూ. 62,300)గా, 12జీబీ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 5,699 యువాన్లు (దాదాపు రూ. 67,000)గా ఉంది.
షావోమీ టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్స్ 3 ధర
- షావోమీ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌తో పాటుగా, షావోమీ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 3 ధర 499 యువాన్లుగా (సుమారు రూ. 5,900)గా ఉంటుందని అగర్వాల్ పేర్కొన్నారు.
Exclusive: #Xiaomi12 Series China Prices [Unconfirmed]
— Ishan Agarwal (@ishanagarwal24) December 27, 2021
Xiaomi 12X
8+128: ¥3499 ($550/₹41K)
8+256: ¥3799
12+256: ¥3999
Xiaomi 12
8+128: ¥4299 ($675/₹50.5K)
8+256: ¥4599
12+256: ¥4999
Xiaomi 12 Pro
8+128: ¥4999 ($785/₹58.8K)
8+256: ¥5299
12+256: ¥5699
Very interesting. 🤔 pic.twitter.com/XCGcj0DqEH
షావోమీ 12 ఫీచర్స్
- ఫుల్-హెచ్ డి+(1,920ఎక్స్1,080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ ప్లే
- క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్
- డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ లైట్
- 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా
- సెంట్రల్ అలైన్డ్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా
- స్క్రీన్ ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
- డ్యూయల్ సిమ్ సపోర్ట్
- 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్
- 67డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
చదవండి: పిచ్చెక్కిస్తున్న షావోమీ 12 స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫీచర్స్..!