బిల్‌ గేట్స్‌ ప్రైవేట్‌ ఆఫీసులో ఉద్యోగం: మహిళలకు షాకింగ్‌ ప్రశ్నల దుమారం

Women applying for jobs at Bill Gates private office asked objectionable questions - Sakshi

మహిళలకు అభ్యంతరకర ప్రశ్నల దుమారం

పోర్న్‌  చూస్తారా, ఎలాంటివి ఇష్టం, డ్రగ్స్‌ వాడతారా?

 వివాహేతర సంబంధాలు, డ్రగ్స్‌పై కూడా ప్రశ్నలంటూ వివాదం

ప్రపంచ  కుబేరుల్లో ఒకరు,  మైక్రోసాఫ్ట్‌  సహ-వ్యవస్థాపకుడు  బిల్ గేట్స్‌మరోసారి వార్తల్లో నిలిచారు. బిల్‌గేట్స్‌​ ఆఫీసులో ఉద్యోగం కోసం పిలిచి  ఇంటర్వ్యూలో  అభ్యంతరకర ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్‌ కథనం వైరల్‌గా మారింది.  (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్‌)

ఈ నివేదిక ప్రకారం బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసు ఇంటర్వ్యూను థర్డ్ పార్టీ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బిల్ గేట్స్ ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగాలు కోరుతున్న మహిళలను లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు. గేట్స్ వెంచర్స్ కోసం ఇంటర్వ్యూ చేసే ఎక్సటర్న్ సెక్యూరిటీ  వారి లైంగిక చరిత్ర, మీకు నచ్చే పోర్న్‌ చిత్రాలు, చిత్రాలు, వారి ఫోన్‌లో నగ్న ఫోటోలేమైనా ఉన్నాయా, ఇంతకు ముందు వివాహేతర సంబంధాలున్నాయా అని మహిళల్ని ప్రశ్నించారు. అంతేకాదు డ్రగ్స్ తీసుకుంటారా వంటి ఇతర ప్రశ్నల్ని కేడా అడిగారు. అయితే అదే స్థానాలకు పురుష దరఖాస్తుదారులు అలాంటి వ్యక్తిగత వివరాల గురించి అడగలేదని కూడా నివేదించింది. 

కొంతమంది మహిళలు తాము ఇంతకుముందు "డాలర్ల కోసం డ్యాన్స్ చేసారా" అని అడిగారని తెలపారని, లైంగికంగా సంక్రమించే వ్యాధికి మీకు సోకిందా అని కూడా ప్రశ్నించారని  తెలిపారని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అయితే ఈ కథనంపై కాన్‌సెంట్రిక్ అడ్వైజర్స్ స్పందించింది. కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ సీఈవో మైక్ లెఫెవర్  ఈ ఆరోపణలను తిరస్కరించారు. చ‍ట్టాలకు లోబడి మాత్రమే ప్రవర్తించామన్నారు.

 ఇదీ చదవండి: Bhuvan Bam Net Worth 2023: తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్‌ యూట్యూబర్‌గా  కోట్లు, ఎలా? 

మరోవైపు  గేట్స్ వెంచర్స్ ప్రతినిధి మాట్లాడుతూ కాన్‌సెంట్రిక్ అడ్వైజర్స్ లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడగడం గురించి  తమకు తెలియదనీ, అయితే ఇది ఈ విధానం ఆమోదయోగ్యం కాదు, తమ  ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆమె పేర్కొన్నారు. కానీ. పదిహేనేళ్ల స్క్రీనింగ్ ప్రక్రియలో ఇలాంటి సమాచారం ఎపుడూ తమకు అందలేదని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామన్నది స్పష్టం చేయలేదు. (బిజినెస్ టైకూన్ల తొలి జాబ్‌ ఏదో తెలుసా? మెగా స్టార్ల సక్సెస్‌ జర్నీ తెలుసా?)

కాగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ బిల్‌ గేట్స్‌ మిలిండా దంపతులు విడాకులు తీసుకోవడం పెద్ద సంచలనం రేపింది. 2021 ఆగస్టులో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తరువాత ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడనే వార్తలొచ్చాయి. దీంతోపాటు  బిల్‌ గేట్స్‌ పలువురు మహిళా ఉద్యోగులతో సంబంధాలున్నాయని ఆరోపణలు కూడా జోరుగానే ఉండటం గమనార్హం.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top