
డీల్ విలువ రూ. 5,524 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రో తాజాగా బ్రిటిష్ బీమా దిగ్గజం ఫీనిక్స్ గ్రూప్ నుంచి భారీ కాంట్రాక్టును పొందింది. 10 ఏళ్ల కాలానికి 50 కోట్ల పౌండ్ల (రూ.5,524 కోట్లు) విలువైన డీల్ కుదుర్చుకున్నట్లు విప్రో వెల్లడించింది.
డీల్‌లో భాగంగా రీఎస్యూర్ బిజినెస్ కోసం జీవిత బీమా, పెన్షన్ బిజినెస్ నిర్వహణ సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను డిజైన్ చేయాల్సి ఉంటుందని విప్రో పేర్కొంది. క్లయింట్లకు అత్యుత్తమ సర్వీసులు అందించడంలో ఫైనాన్షియల్ సంస్థలకు విప్రో సహకారాన్ని, కట్టుబాటును ప్రస్తుత ల్యాండ్‌మార్క్ డీల్ పట్టిచూపుతున్నదని విప్రో యూరప్ సీఈవో ఓంకార్ నిశల్ తెలియజేశారు.
భారీ డీల్ నేపథ్యంలో విప్రో షేరు బీఎస్‌ఈలో 1.4% క్షీణించి రూ. 267 వద్ద ముగిసింది.