భగ్గుమన్న టోకు ధరలు  | Wholesale price inflation in India dramatically increased to 8. 30 per cent in April | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న టోకు ధరలు 

May 15 2026 5:34 AM | Updated on May 15 2026 5:34 AM

Wholesale price inflation in India dramatically increased to 8. 30 per cent in April

ఏప్రిల్‌లో 8.3 శాతానికి పెరిగిన ఇంధనం, విద్యుత్‌ ధరలు 

సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఏప్రిల్‌లో భగ్గుమంది. ముడి చమురు, ఇంధన ధరలు పెరగడంతో 8.3 శాతానికి ఎగబాకినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది 42 నెలల గరిష్ట స్థాయి. మార్చిలో ఉన్న 3.88 శాతంతో పోల్చితే ఒక్క నెల వ్యవధిలోనే భారీగా పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పశి్చమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన ధరలు భారీగా పెరిగిపోవడం, మినరల్‌ ఆయిల్స్, బేసిక్‌ మెటల్స్‌ ధరలు ఎగసిపడడం ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరేందుకు దారితీసింది. 2025 ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం 0.85 శాతంగా ఉండడం గమనార్హం.  

రంగాల వారీగా ద్రవ్యోల్బణం తీరిది..  
∙అన్ని ప్రధాన రంగాల్లోనూ టోకు ధరలు పెరిగాయి. ప్రధానంగా ఇంధనం, విద్యుత్‌ రంగంలో ద్రవ్యోల్బణం అత్యధికంగా 24.71 శాతంగా నమోదైంది. మార్చిలో కేవలం 1.05 శాతమే ఉండటం గమనార్హం.  
 

Advertisement
 
Advertisement
Advertisement