రిలాక్స్ అండ్ రీ-ఎనర్జైజ్: ఉద్యోగులకు బ్రహ్మాండమైన దివాలీ ఆఫర్‌

WeWork Offers Employees 10 Day Diwali Break - Sakshi

సాక్షి, ముంబై: గ్లోబల్ కోవర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ వీవర్క్‌ ఇండియాలోని తన ఉద్యోగులందరికీ దీపావళి పర్వదినం సందర్భంగా బంపర్‌ ఆఫర్‌  ప్రకటించింది. 'రిలాక్స్ అండ్ రీ-ఎనర్జైజ్'  అంటూ  10 రోజుల దీపావళి సెలవులను ఉద్యోగులకు ప్రకటించింది. ఈ దీపావళి సందర్భంగా ఉద్యోగులు పని నుండి విరామం తీసుకొని,  కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు ఈ సెలవులు  బాగా ఉపయోగపడతాయని  విశ్వసిస్తున్నట్టు  కంపెనీ వెల్లడించింది.

ఈదీపావళి వెకేషన్‌ ​కుటుంబాలతో దీపావళి జరుపుకోవడంతోపాటు, ఉద్యోగులకు విశ్రాంతితో, మరింత ఉత్సాహంగా పనిచేసేలా శక్తి ఇస్తుందని  వీవర్క్ ఇండియా  చీఫ్ పీపుల్ అండ్‌  కల్చర్ ఆఫీసర్ ప్రీతి శెట్టి  తెలిపారు. ఇటీవలి  కాలంలో కంపెనీ అంతర్గత బెంచ్‌మార్క్‌లను అధిగమించిన  నేపథ్యంలో  ప్రతీ ఉద్యోగి పట్ల ‍ కృతజ్ఞతగా తాముఈ సెలవులను ప్రకటించిందని చెప్పారు.  కాగా న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న వీ వర్క్‌ గత సంవత్సరం పండుగ సీజన్‌లో 10 రోజుల సెలవులను  ఆఫర్‌ చేసిన సంస్థ  ప్రతీ ఏడాది దీన్ని కొనసాగించాలని భావిస్తోందట.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top