ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌.. మళ్లీ వచ్చాడహో! | Sakshi
Sakshi News home page

ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌.. మళ్లీ వచ్చాడహో!

Published Fri, Dec 17 2021 8:09 PM

Vertigo Video Inspired by the Alfred Hitchcock Film - Sakshi

క్లాసిక్‌ హారర్‌ డైరెక్టర్‌ ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ వీడియో గేమ్‌ రూపొందిస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది! కాని ఇప్పుడు ఆయన మన మధ్య లేరు కదా. ఈ లోటును పూరిస్తుంది ఆల్‌ఫ్రెడ్‌హిచ్‌కాక్‌–వర్టిగో. హిచ్‌కాక్‌ మూవీ ‘వర్టిగో’ను ఆధారం చేసుకొని రూపొందించిన ఎడ్వెంచర్‌ వీడియోగేమ్‌ ఇది. కథ అదే అయినప్పటికీ కథనం, పాత్రలు కొత్తగా అనిపిస్తాయి. ఈడి మిల్లర్‌ అనే రచయిత కారు ప్రమాదానికి గురవుతాడు. భార్య, పిల్లల ఆచూకి తెలియదు. ఈ 3 డైమన్షన్‌ గేమ్‌వరల్డ్‌లో ప్లేయర్‌ 3 క్యారెక్టర్లను కంట్రోల్‌ చేయాలి. ‘కెన్‌ యూ ట్రస్ట్‌ యువర్‌ వోన్‌ మైండ్‌?’ అంటున్న ఈ గేమ్‌ ఫ్లాష్‌బ్యాక్‌లతో కూడిన మిస్టరీలతో ప్లేయర్‌ మైండ్‌కు బోలెడు పనికల్పిస్తుంది. 

ప్లాట్‌ఫామ్స్‌: విండోస్, ప్లేస్టేషన్‌ 5, ప్లేస్టేషన్‌ 4, ఎక్స్‌బాక్స్‌ సిరీస్‌ ఎక్స్‌/ఎస్, ఎక్స్‌బాక్స్‌ వన్, నిన్‌టెండో స్విచ్‌ 
మోడ్స్‌: సింగిల్‌ ప్లేయర్‌ 
 

Advertisement
 
Advertisement
 
Advertisement