వెంచర్‌ క్యాటలిస్ట్స్‌ నుంచి మూడు యూనికార్న్‌లు

Venture Capitalist Group Says 54 Startups Over 50 Million Dollars In 7 Years - Sakshi

ముంబై: దేశంలోనే మొదటి స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ ‘వెంచర్‌ క్యాటలిస్ట్స్‌ గ్రూపు’.. తన పోర్ట్‌ఫోలియోలోని 54 స్టార్టప్‌లు ఈ ఏడాది 50 మిలియన్‌ డాలర్ల విలువను (రూ.405 కోట్లు) అధగమించినట్లు  ప్రకటించింది. ఈ ఏడాది ఫండింగ్‌ 70 శాతం పడిపోయిన సవాళ్ల వాతావరణంలోనూ ఈ సానుకూల పరిణామం చోటుచేసుకన్నట్టు పేర్కొంది.

వెంచర్‌ క్యాట లిస్ట్స్‌ ఇప్పటి వరకు 33 సూనికార్న్‌లు, 100కు పైగా మినీకార్న్‌లకు వేదికగా నిలిచింది. విడిగా చూస్తే రెండు డజన్లకు పైగా కంపెనీలు 100 మిలియన్‌ డాలర్ల వ్యాల్యూషన్‌ను అధిగమించినట్టు సంస్థ తెలిపింది. ఇందులో షిప్‌ రాకెట్, భారత్‌ పే, వేదాంతు గత ఏడాది కాలంలో యూనికార్న్‌ హోదా పొందినట్టు వెల్లడించింది.

చదవండి: బాబోయ్‌, హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. కారణం ఎంటంటే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top