తెలంగాణలో అమెరికన్‌ కంపెనీ దూకుడు..! ఆ రంగంలో భారీగా ఉద్యోగుల నియామకం..!  | US Based Eclat To Hire 1400 Across Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో అమెరికన్‌ కంపెనీ దూకుడు..! ఆ రంగంలో భారీగా ఉద్యోగుల నియామకం..! 

Feb 4 2022 9:27 AM | Updated on Feb 4 2022 10:11 AM

US Based Eclat To Hire 1400 Across Telangana - Sakshi

అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్‌ టెక్నాలజీ సేవల సంస్థ ‘ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌’ తెలంగాణలో తన సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కరీంనగర్‌, హైదరాబాద్‌లో గ్లోబల్‌ డెలివరీ సెంటర్లను ఏర్పాటుచేసిన ఈ సంస్థ.. కొత్తగా వరంగల్‌, ఖమ్మంలో కేంద్రాలను తెరువనున్నట్టు వెల్లడించింది. ఈ నాలుగు కేంద్రాల్లో కలిపి కొత్తగా 1,400 మందిని నియమించుకోనున్నట్టు స్పష్టం చేసింది.

ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ సీఈవో కార్తీక్‌ పొల్సాని నేతృత్వంలో ఎక్లాట్‌ గ్రూప్‌ ప్రతినిధులు బృందం గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రాబోయే 18 నెలల్లో కంపెనీ విస్తరణ ప్రణాళికలను కేటీఆర్‌తో చర్చించారు. వరంగల్‌, ఖమ్మంలో గ్లోబల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, ఒక్కోచోట కనీసం 300 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్‌, హైదరాబాద్‌లోని కేంద్రాల్లో అదనపు నియామకాలు చేపడతామని, హైదరాబాద్‌లో 500 మందిని, కరీంనగర్‌లో 200 మందిని నియమిస్తామని వెల్లడించారు. 




మెడికల్‌ కోడింగ్‌లో దిట్ట..!
ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌కు మెడికల్‌ కోడింగ్‌, టెక్నాలజీ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ప్రభుత్వ సహకారంతోపాటు టాస్క్‌ ద్వారా మాకు నిపుణులైన మానవవనరులను అందిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు’ అని కార్తిక్‌ తెలిపారు. హెల్త్‌కేర్‌ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా వినూత్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ‘తెలంగాణ ఏఐ మిషన్‌’ (టీ-ఎయిమ్‌)తో కలిసి పనిచేయాలని ఆసక్తితో ఉన్నామని చెప్పారు. 

ద్వితీయ శ్రేణి నగరాల్లో వేగంగా..!
ఐటీ ఆధారిత సేవలను తెలంగాణలోని టైర్‌-2 నగరాల్లో విస్తరణ ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఐటీ మినిష్టర్‌ కేటీఆర్‌ వెల్లడించారు. టైర్‌-2 నగరాలకు విస్తరించాలని ఎక్లాట్‌ తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్‌ స్వాగతించారు. ప్రభుత్వం తరఫున ఎక్లాట్‌కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 

చదవండి: రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ దూకుడు..! జర్మన్‌ కంపెనీ రెడ్డీస్‌ చేతిలోకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement