పథకాల టార్గెట్లు సాధించండి..బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచన

Union Finance Ministry Psbs To Work Towards Achieving The Targets - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్, సామాజిక భద్రత పథకాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంపై మరింతగా దృష్టి పెట్టాలని బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది.

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ), ఆర్థిక సంస్థల చీఫ్‌లతో ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషి గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సూచనలు చేసింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన (పీఎంజేడీవై), ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) తదితర పథకాలను సమీక్షించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి చేర్చేందుకు (ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) ఉద్దేశించిన స్కీములపై ప్రజల్లో అవగాన పెంచేందుకు బ్యాంకులు ఆర్థిక అక్షరాస్యత క్యాంపులు నిర్వహించే అంశంపైనా చర్చ జరిగినట్లు పేర్కొంది.   

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top