యూకే మంత్రి రిషి సునక్‌ భార్య పన్ను చెల్లింపులపై వివాదం..! క్లారిటీ ఇచ్చిన అక్షతా మూర్తి..!

UK Minister Rishi Sunak Wife Infosys Link Sparks New Row Over Taxes - Sakshi

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో రష్యాలోని ఇన్ఫోసిస్‌ వ్యాపారాలపై బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌పై యూకే మీడియా ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్‌ వ్యవహారంపై రిషి సునక్‌ అక్కడి మీడియాకు ధీటైన జవాబునిచ్చారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితమే ఇన్ఫోసిస్‌ రష్యాలో తమ కార్యకలపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ఈ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా లేదు. తాజాగా రిషి సునక్ భార్య అక్షతా మూర్తి పన్ను చెల్లింపులకు సంబంధించి వివాదం తెరపైకి వచ్చింది.

పన్ను చెల్లింపులపై వివరణ..!
అక్షతా మూర్తి  పన్ను చెల్లింపులపై వారి ప్రతినిధి వివరణ ఇచ్చారు. ట్యాక్స్ చెల్లింపులో భాగంగా అక్షతాను బ్రిటన్‌లో నివాసం లేని వ్యక్తిగా పరిగణించబడుతోందని వెల్లడించారు. అయితే యూకేలో వచ్చే ఆదాయంపై అక్షతా బ్రిటన్‌లో పన్ను చెల్లిస్తున్నారని వారి ప్రతినిధి పేర్కొన్నారు. అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్‌లో దాదాపు 0.93 శాతం వాటా వుంది.అయితే ఆమె భారతీయ వ్యాపారంపై వచ్చే డివిడెండ్లపై బ్రిటన్‌లో పన్ను చెల్లించడం లేదు. ఏప్రిల్‌ 7 న ఈ వ్యవహారంపై  బ్రిటన్ వార్తాపత్రికలలో చర్చనీయాంగా మారింది. ఈ ఏడాది బ్రిటన్‌ ప్రభుత్వం లక్షలాది మందికి పన్నులు వేస్తున్నట్లు ఈ కథనాల సారాంశం.ఈ క్రమంలోనే తన భార్య పన్ను హోదా నుంచి ప్రయోజనం పొందాడో లేదో రిషి సునక్ చెప్పాలంటూ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన చట్టసభ్యుడు, ట్రెజరీ ప్రతినిధి తులిప్ సిద్ధిక్ డిమాండ్ చేసినట్లు వార్త పత్రికలు ప్రచురించాయి.

భారత పౌరురాలిగా..!
అక్షతా మూర్తి భారతీయ పౌరురాలిగా ఉన్న ఆమెను బ్రిటీష్ చట్టాల ప్రకారం నాన్ - డొమిసిల్డ్‌గా పరిగణిస్తున్నారని చెప్పారు. దీనికి కారణం భారత ప్రభుత్వం  తన పౌరుల్ని ఏకకాలంలో మరో దేశ పౌరసత్వాన్ని కలిగి వుండేందుకు అనుమతించదని ఆయన పేర్కొన్నారు.ఇకపోతే అక్షతా మూర్తి భారతీయ పౌరురాలు.ఆమె పుట్టిన దేశం, తల్లిదండ్రుల నివాసం అక్కడేనని అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా రిషి సునక్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన భార్య స్థితిని ప్రభుత్వానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. 

చదవండి: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌...ఇన్ఫోసిస్‌ సంచలన నిర్ణయం..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top