ట్విట్టర్ లవర్స్ కి గుడ్ న్యూస్

Twitter Plans to Relaunch Verification Program Next Year - Sakshi

ట్విట్టర్ చెక్-మార్క్ బ్యాడ్జ్‌లను గుర్తింపు పొందిన ఖాతాలకు ఎలా ఇస్తుందో అనే దాని కోసం కొత్త ప్రణాళికలను రూపొందిస్తుంది. గుర్తింపు పొందిన ప్రముఖుల ఖాతాలకు ఉపయోగించే బ్లూ చెక్-మార్క్ బ్యాడ్జ్‌లపై గతంలో వచ్చిన విమర్శలను పరిష్కరించడానికి కంపెనీ కొన్ని రోజులుగా ప్రయత్నిస్తుంది. 2021 ప్రారంభంలో కొత్త పబ్లిక్ అప్లికేషన్ ప్రాసెస్‌తో సహా బ్లూ బ్యాడ్జ్ విధానాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కొన్ని సంవత్సరాలుగా ట్విట్టర్ అకౌంట్ల ధృవీకరణలో వివాదాలు రావడంతో మూడేళ్ల క్రితం ఈ విధానాన్ని నిలిపివేసింది. ఇప్పుడు తాజాగా మళ్లీ తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇప్పడు కొత్తగా తీసుకొస్తున్న ఈ బ్లూ బ్యాడ్జ్ ఫీచర్ పై వినియోగదారులు తమ విలువైన అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. కొత్త పాలసీకి సంబందించిన పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ అనేది నవంబర్ 27న ప్రారంభమై డిసెంబర్ 8వరకు కొనసాగనున్నట్లు తెలిపింది. ‘‘పబ్లిక్ వెరిఫికేషన్ ఫీచర్ పై మీరు కూడా మీ అభిప్రాయాన్ని ట్వీట్ చేయాలనుకుంటే #VerificationFeedback అనే హ్యాష్‌ట్యాగ్‌"ను ఉపయోగించి ట్విట్టర్లో పోస్ట్ చేయాలని తెలిపింది. (చదవండి: డిసెంబర్ నెలలో రాబోతున్న మొబైల్స్ ఇవే!)

గతంలో తీసుకొచ్చిన బ్లూ బ్యాడ్జ్ ఫీచర్ పై ఏకపక్షంగా, గందరగోళంగా ఉందనే విమర్శలు రావడంతో అప్పట్లో పబ్లిక్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసింది. ఇప్పుడు కొత్తగా తీసుకురాబోయే పాలసీలో కొన్ని ఖాతాలను నోటబుల్ అకౌంట్స్ గా గుర్తించినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా ప్రభుత్వ అధికారులు, కంపెనీలు, లాభాపేక్షలేనివి, వార్తా సంస్థలు, వినోదకారులు, క్రీడా బృందాలు, అథ్లెట్లు మరియు కార్యకర్తలు వంటి ముఖ్యమైన, క్రియాశీల ఖాతాలకు బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ ను అందించనుంది. ప్రస్తుతం క్రియాశీలకంగా లేని, సంస్థ విధానాలను పాటించని ప్రొఫైల్ ఉన్న ఖాతాలకు బ్లూ బ్యాడ్జ్ ని తొలగించాలని ట్విట్టర్ భావిస్తుంది. డిసెంబర్ 17న ప్రవేశపెట్టనున్న డ్రాఫ్ట్ వెరిఫికేషన్ పాలసీని ఇంగ్లీష్, హిందీ, అరబిక్, స్పానిష్, పోర్చుగీస్, జపనీస్ భాషలలో అందుబాటులో తీసుకురానున్నట్లు ట్విట్టర్ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top