
సైబర్ క్రైమ్స్ ప్రస్తుతం భారతదేశంలో ఒక పెద్ద సమస్యగా మారిపోతోంది. ఎప్పటికప్పుడు స్కామర్లు కొత్త అవతారాలెత్తి ప్రజలను మోసం చేస్తున్నారు, డబ్బు దోచేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో మొబైల్ యూజర్లకు చాలా జాగ్రత్తగా ఉండాలని 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) హెచ్చిరికలు జారీ చేసింది.
స్కామర్లు బాధితులను మోసం చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలను నిలిపేస్తామని బెదిరిస్తారు. బాధితుడు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నేరగాళ్లు తప్పుగా పేర్కొంటారు. దీంతో కొందరు భయపడి నేరగాళ్లు చెప్పినట్లు వింటారు, భారీగా డబ్బు కోల్పోతారు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.. షేర్ చేసిన ఒక వీడియోలో ఇలాంటి స్కామ్‌కు సంబంధించిన సంఘటనను చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మొబైల్ యూజర్ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని.. సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించి ఏవైనా అనుమానాస్పద కాల్‌లను నివేదించాలని ట్రాయ్ కోరింది.
భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్
ప్రభుత్వ డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్ట్ స్కామ్ కారణంగా బాధితులు సుమారు రూ. 120.3 కోట్లు నష్టపోయినట్లు తెలిసింది. అక్టోబర్ 27న మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమాచారాన్ని అందించారు.
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) 2024 మొదటి త్రైమాసికంలో దాదాపు 7.4 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందుకున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: చెత్త సంపాదన రూ.2,364 కోట్లు: ప్రశంసించిన మోదీ
డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు లేదా సైబర్ నేరగాళ్లు బాధితురాలకు ఫోన్ చేసి అక్రమ వస్తువులు లేదా నిషిద్ధ వస్తువులకు సంబంధించిన నేరంలో మీ ప్రమేయం ఉందని భయపెడతారు. టెక్నాలజీలను ఉపయోగించి వీడియో కాల్స్ ద్వారా నకిలీ కోర్టులను, న్యాయమూర్తులను ఏర్పటు చేస్తారు. అరెస్టు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి డబ్బు చెల్లించాలని.. భారీ మొత్తంలో మోసం చేస్తుంటారు. కాబట్టి ఇలా మోసం చేసేవారు మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి బెదిరిస్తే.. తప్పకుండా సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.
अचानक से TRAI 📞 ने कि आपका नेटवर्क disconnect करने की बात 🧐🤔
सावधान रहे, ये एक scam है !
आपका अगला कदम ? रिपोर्ट करें चक्षु के साथ https://t.co/6oGJ6NSQal पर#SafeDigitalIndia pic.twitter.com/Zmkwj2Rjzg— DoT India (@DoT_India) November 9, 2024