సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు | today stock market update money mantra | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Feb 1 2024 3:52 PM | Updated on Feb 1 2024 4:02 PM

today stock market update money mantra - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి.  ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ సూచీలు తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా నిఫ్టీ 35 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

గురువారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 106.81 పాయింట్లు లేదా 0.15 శాతం నష్టపోయి 71,645.30 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 36.05 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 21,689.65 వద్ద ట్రేడింగ్‌ ముగించింది.

అల్ట్రాటెక్‌ సిమెంట్‌, లార్సెన్‌, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్‌ కంపెనీల షేర్లు టాప్‌ లూజర్స్‌గా నష్టాలను చవిచూశాయి. మరోవైపు మారుతీ సుజుకీ, సిప్లా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐచర్‌ మోటర్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement