టెక్నాలజీతో సాధికారత

technology at the workplace can be a game changer shrmi - Sakshi

హైదరాబాద్‌:సర్వత్రా టెక్నాలజీ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలు వృద్ధి కోసం సాంకేతికతపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎస్‌హెచ్‌ఆర్‌ఎం ఇండియా సీఈవో అచల్‌ ఖన్నా తెలిపారు. (18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్‌మెంట్‌)

పనిప్రదేశాల్లో కూడా టెక్నాలజీ వినియోగాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మార్పునకు కారకులయ్యేలా టెక్నాలజీతో ప్రజలకు సాధికారత లభించగలదని వివరించారు. ఎస్‌హెచ్‌ఆర్‌ఎంఐ టెక్‌23 కాన్ఫరెన్స్, ఎక్స్‌పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. (బీర్‌తో నడిచే బైక్‌: మతిపోయే స్పీడ్‌, కావాలంటే వీడియో చూడండి!)

సదస్సు రెండో రోజున హెచ్‌ఆర్‌ సిస్టమ్స్‌ బ్లూప్రింట్‌ పేరిట రూపొందించిన రిపోర్టును ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 120 మంది పైగా వక్తలు, 4,000 మంది పైచిలుకు హెచ్‌ఆర్‌ నిపుణులు పాల్గొన్నారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top