అప్‌గ్రేడెడ్‌ ఇంజిన్లతో టాటా వాహనాలు | Tata Vehicles With Upgraded Ingene | Sakshi
Sakshi News home page

అప్‌గ్రేడెడ్‌ ఇంజిన్లతో టాటా వాహనాలు

Feb 13 2023 7:48 AM | Updated on Feb 13 2023 7:48 AM

Tata Vehicles With Upgraded Ingene - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కఠినతరమైన ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో అప్‌గ్రేడ్‌ చేసిన ఇంజిన్లతో ప్యాసింజర్‌ వాహనాల శ్రేణిని ఆవిష్కరించినట్లు టాటా మోటర్స్‌ వెల్లడించింది. ఈ ఇంజిన్లు ఈ–20 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని పేర్కొంది. వీటితో వాహనాలు మరింత సురక్షితంగానూ, సౌకర్యవంతంగా ఉంటాయని వివరించింది.

ప్రారంభ గేర్లలో కూడా సౌకర్యవంతమైన అనుభూతి కలిగించేలా ఆల్ట్రోజ్, పంచ్‌ వాహనాలను తీర్చిదిద్దినట్లు టాటా మోటర్స్‌ వివరించింది. ఈ రెండు మోడల్స్‌లో మరింత మైలేజీనిచ్చేలా ఐడిల్‌ స్టాప్‌ స్టార్ట్‌ ఫీచర్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. పనితీరు మెరుగుపడేలా నెక్సాన్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కూడా రీట్యూన్‌ చేసినట్లు కంపెనీ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement