ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా కారు..!

Tata Nexon EV: India Best Selling Electric Car, Hits New Milestone - Sakshi

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల పరంగా టాటా మోటార్స్ రికార్డు సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు అమ్మకాల పెంచుకుంటూ పోతూ దేశీయ ఈవీ మార్కెట్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. రెండేళ్ల క్రితం నెక్సన్ ఈవీ కారును ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 13,500 యూనిట్లను కంపెనీ సేల్ చేసింది. నెక్సన్ ఈవీ ప్రస్తుతం భారతదేశంలో ప్యాసింజర్ వేహికల్ కార్లలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ 30.2 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. 

నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు 9.14 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది 127 బిహెచ్పి, 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారు 127 బిహెచ్‌పీ, 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును జిప్‌ట్రాన్ టెక్నాలజీ సహాయంతో అభివృద్ది చేసింది. నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ఎక్స్ఎమ్, ఎక్స్ఎమ్ ప్లస్, ఎక్స్‌జెడ్ ప్లస్ మోడళ్లలో విక్రయించబడుతోంది. నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం సుమారు రూ.13.99 లక్షలు.

గత ఏడాది అక్టోబర్ నెలలో టాటా భారతదేశంలో 10,000కు పైగా ఎలక్ట్రిక్ అమ్మకాలను నమోదు చేసినట్లు సంస్థ గతంలో ప్రకటించింది. దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో టాటా 70 శాతం వాటాను కలిగి ఉంది. టాటా మోటార్స్ ఇటీవల నెక్సాన్ డార్క్ అనే సరికొత్త నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ ప్రారంభించింది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో టాటా నెక్సాన్ ఈవీని గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అయితే, రెగ్యులర్ హోమ్ ఛార్జర్ ద్వారా చార్జ్ చేసేటప్పుడు 10 శాతం నుంచి 90 శాతం వరకు చేరుకోవడానికి 8.30 గంటల సమయం పడుతుంది. వచ్చే ఏడాదిలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలని చూస్తుంది. 

(చదవండి: లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే.. కొత్త ఒరవడికి శ్రీకారం!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top