ఆ ఫీట్‌ దాటేసిన టాటా ఆల్ట్రోజ్‌.. 20 నెలల్లోనే రికార్డ్‌ !

TATA Altroz Sales Crossed One Lakh Mark - Sakshi

ప్రీమియం హచ్‌బ్యాక్‌ కేటగిరీలో టాటా ఆల్ట్రోజ్‌ అరుదైన ఘనత సాధించింది. కోవిడ్‌ సంక్షోభం నడుమ అమ్మకాల్లో దుమ్ము రేపింది. తక్కువ కాలంలోనే మార్కెట్‌లో తన ముద్రను చూపించింది. 

2020 జనవరిలో
మైలేజీ తప్ప భద్రతకు పెద్ద పీట వేయని ఇండియన్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌తో టాటా సంస్థ ఆల్ట్రోజ్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కేటగిరీలో 2020 జనవరిలో ఈ కారు మార్కెట్‌లోకి వచ్చింది. కారు ప్రమోషన్స్‌ మొదలైన కొద్ది రోజులకే కోవిడ్‌ సంక్షోభం దేశం మొత్తాన్ని చుట్టేసింది. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో చాలా సంస్థలు కార్ల తయారీనే నిలిపేశాయి.

కల్లోల పరిస్థితుల్లో
విపత్కర పరిస్థితుల మధ్య మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ అమ్మకాల్లో ఆల్ట్రోజ్‌ రికార్డు సృష్టించింది. కేవలం 20 నెలల వ్యవధిలోనే లక్ష యూనిట్ల కార్ల అమ్మకాలు జరుపుకుని అరుదైన రికార్డు సాధించింది. పూనేలో ఉన్న టాటా కార్ల తయారీ కేంద్రం నుంచి వన్‌ లాక్‌  ఆల్ట్రోజ్‌ కారు యూనిట్‌ని ర్కెట్‌లోకి పంపినట్టు టాటా ప్రతినిధులు తెలిపారు.

2021 మార్చిలో
టాటా ఆల్ట్రోజ్‌ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత సగటున ప్రతీ నెల 6,000 కార్ల అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని చుట్టేయడానికి ముందు 2021 మార్చిలో 7,500 కార్ల అమ్మకాలు జరిగాయి. ఇదే ఊపు కొనసాగితే ఎప్పుడో లక్ష యూనిట్ల మార్క్‌ దాటేవాళ్లమని, అయితే సెకండ్‌వేవ్‌ తమ స్పీడుకు బ్రేకులు వేయడంతో కొంత ఆలస్యంగా లక్ష యూనిట్ల సేల్స్‌ మార్క్‌ని దాటిందని కంపెనీ సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ అంబ ప్రకటించారు. 

20 శాతం వాటా
ఇరవై నెలల క్రితం మార్కెట్‌లోకి వచ్చినా.. ఈ ఏడాది టాటా ఆల్ట్రోజ్‌కి వాహన ప్రియులు జై అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కార్‌ సేల్స్‌కి సంబంధించి 20 శాతం వాటా ఆల్ట్రోజ్‌ దక్కించుకుంది. ఇండికా తర్వాత హ్యచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో టాటాకు ఆల్ట్రోజ్‌ వరంలా మారింది.
- టాటా ఆల్ట్రోజ్‌ మార్కెట్‌లో ఆరు వేయింట్లలో లభిస్తోంది
- పెట్రోలు, డీజిల్‌ వెర్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది
- 5 స్పీడ్‌ మ్యానువల్‌ గేర్‌ సిస్టమ్‌ ఉంది
- ఎక్స్‌ షోరూంలో వివిధ వేరియంట్లను బట్టి ఈ కారు కనిష్ట ధర రూ. 5.84 లక్షల నుంచి రూ. 9.59 లక్షల వరకు ఉంది.

చదవండి : దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top