దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్!

Toyota Kirloskar To Discontinue Yaris Car In India - Sakshi

దేశంలో చాలా విదేశీ కంపెనీలు ఇక్కడ పోటీని తట్టుకోలేక ఏకంగా దుకాణం మూసేస్తుంటే? మరికొన్ని కొన్ని తక్కువగా సేల్ అవుతున్న మోడల్ కార్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో కంపెనీ వచ్చి చేరింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ ఈ రోజు (సెప్టెంబర్ 27) నుంచి భారత మార్కెట్లో సెడాన్ కారు యారిస్ తయారిని/అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు టయోటా కిర్లోస్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే 2022లో మరిన్ని ఇతర కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టయోటా తెలిపింది.

టయోటా కిర్లోస్కర్ ప్రస్తుతం ఈ కారును కొనుగోలు చేసిన వినియోగదారులకు సేవలు, విడిభాగాలు అందిస్తామనీ హామీ ఇచ్చింది. "టయోటాకు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ సర్వీస్ అవుట్ లెట్ ద్వారా యారిస్ కస్టమర్లకు అందించే సేవలలో ఎటువంటి అంతరాయం కలగదు. అలాగే, నిలిపివేసిన మోడల్ ఒరిజినల్ విడిభాగాలను కనీసం 10 సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే విధంగా చూస్తామని" టయోటా వాగ్దానం చేస్తుంది.(చదవండి: ఆ విషయమై నన్నెవరూ సంప్రదించలేదు: రతన్‌ టాటా)

టయోటా యారిస్ మొదటి కారును 2018 సంవత్సరం ఏప్రిల్‌లో రూ 9 లక్షల నుంచి రూ .14 లక్షల మధ్య లాంచ్ చేసింది. టయోటా యారిస్ కారును హోండా సిటీకి పోటీగా తీసుకొని వచ్చారు. ప్రీమియం సెడాన్ విభాగంలో హోండా సిటీతో పాటు హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్, స్కోడా రాపిడ్, వోక్స్వ్యాగన్ వెంటోలతో ఈ టయోటా యారిస్ పోటీగా నిలిచింది. కానీ ఈ కారు ఈ విభాగంలో తన మార్క్ చూపద్యంలో విఫలమైంది అంతేగాకుండా లాంచ్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top