అప్పుల్లో తమిళనాడు టాప్.. ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందంటే?

Tamil Nadu Top Borrower Among States For Third Year Says Rbi - Sakshi

దేశ వ్యాప్తంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. ఆ నివేదికలో వరుసగా మూడో సారి దేశంలో అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది.

ఆర్ధిక సంవత్సరం-2023 అంటే ఏప్రిల్‌ 1,2022 నుంచి మార్చి 31, 2023 మధ్య కాలంలో రాష్ట్ర అభివృద్ధి కోసం తమిళనాడు తీసుకున్న రుణాలు (స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్‌- ఎస్‌డీఎల్‌) రూ. 68,000 కోట్లకు చేరినట్లు నివేదించింది.  

రాష్ట్రాల వారీగా  
గడిచిన మూడు ఆర్ధిక సంవత్సరాల్లో (2020 - 2023) అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలోనూ తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. మహరాష్ట్ర , వెస్ట్‌ బెంగాల్‌ వరుసగా 2, 3 స్థానాల్లో ఉండగా ..ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌ 7వ స్థానంలో ఉన్నాయి.తెలంగాణ, గుజరాత్‌, హర్యానాలు 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.

అప్పుల జాబితా ప్రకారం.. తమిళనాడు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రుణాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆర్ధిక సంవత్సరం 2021లో రూ. 87,977 కోట్లు, ఆర్ధిక సంవత్సరం 2022లో రూ.87,000 కోట్లను అప్పుగా తీసుకుంది. అయితే, గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఆర్ధిక సంవత్సరం 2023 సమయానికి  రుణాల శాతం తగ్గింది.

ఆర్‌బీఐ నివేదికలో ఆర్ధిక సంవత్సరం 2023 ముగిసే సమయానికి దేశంలో అప్పులు తక్కువగా తీసుకున్న 10 రాష్ట్రాల జాబితాలో ఉత్తర ప్రదేశ్‌, వెస్ట్‌ బెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. ఆర్ధిక సంవత్సరం 2022లో ఉత్తర ప్రదేశ్‌కు రూ.62,500 కోట్లు ఉండగా.. కేవలం 11 నెలల్లో ఆ మొత్తం కాస్త రూ. 33,500 కోట్లకు తగ్గింది.  సొంత పన్ను, రాబడి వంటి ఇతర కారణాల వల్ల రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించుకున్నట్లు నివేదిక హైలెట్‌ చేసింది. 

దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితా ఇలా ఉంది
ఆర్‌బీఐ నివేదికలో 2023 ఏప్రిల్‌ - జూన్‌ సమయానికి  22 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు రూ.1.99-లక్షల కోట్ల రుణాలు తీసుకోవచ్చని అంచనా వేసింది.

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ప్రకారం.. 
రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ప్రకారం.. 2024లో జనవరి, ఫిబ్రవరి, మార్చి (క్యూ1) నాటికి మహరాష్ట్ర (రూ.25,000కోట్లు), తమిళనాడు (రూ.24,000 కోట్లు) మొత్తం రూ.2లక్షల కోట్లు రుణాలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

చదవండి👉 యాపిల్‌ కంపెనీలో రూ. 138 కోట్ల ఘరానా మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top