బుల్‌ జోరు, భారీ లాభాలతో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు | Stock Market Live News Update | Sakshi
Sakshi News home page

బుల్‌ జోరు, భారీ లాభాలతో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

Aug 4 2021 9:38 AM | Updated on Aug 4 2021 9:42 AM

Stock Market Live News Update - Sakshi

దేశీయ మార్కెట్‌లో బుల్‌రన్‌ కొనసాగుతుంది. బుధవారం మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం 9.40 నిమిషాల సమయంలో 422.36 పాయింట్ల లాభంతో 54246 పాయింట్లతో ట్రేడింగ్‌ కొనసాగుతుండగా.. నిఫ్టీ 115.95 పాయింట్ల లాభాలతో 16246 వద్ద ట్రేడ్‌ అవుతుంది. 

కాగా, కరోనా మహమ్మారితో కుంటుపడ్డ ఆర్ధిక వ్యవవస్థ వేగంగా కోలుకునేలా సంకేతాలివ్వడం, కార్పొరేట్‌ తొలి త్రైమాసిక ఆర్థిక పలితాలు,ఐపీఓల సందడి, జీఎస్‌టీ వసూళ్లు పెరగడం, తయారీ రంగం ఊపందుకోవడం వంటి సానుకూల అంశాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో మార‍్కెట్లు భారీ లాభాల్ని చవి చూస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement