ఇండియాలో తయారీ.. ప్రపంచానికి ఎగుమతి..

Skoda Volkswagen India exporting of T Cross Cars to Mexico - Sakshi

ఆటోమోబైల్‌ ఇండస్ట్రీలో గుణాత్మక మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు విదేశాల్లో తయారైన కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఇండియాలో తయారైన కార్లను విదేశాలకు ఎగుమతి చేసే స్టేజ్‌కి చేరుకుంది. జర్మన్‌ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా ప్లాంటులో తయారు చేసిన కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ‘ఇంజనీరిడ్‌ ఇన్‌ ఇండియా డ్రివెన్‌ బై ది వరల్డ్‌’ కాన్సెప్టుతో ఈ పని చేపట్టింది.


పూనేలో ఉన్న కార్ల తయారీ యూనిట్‌లో రూపొందిన టీ క్రాస్‌ మోడల్‌ కారును మెక్సికోకు ఎగుమతి చేస్తున్నట్టు స్కోడా ఆటో ఫోక్స్‌ వ్యాగన్‌ ఇండియా చైర్మన్‌ కాన్‌వాన్‌ సిలీన్‌ ప్రకటించారు. ఇక్కడ తయారైన కార్లకు మెక్సికో, సౌతాఫ్రికా, కొలంబియా, ఈక్వెడార్‌, అర్జెంటీనా దేశాల్లో చాలా డిమాండ్‌ ఉందని ఫోక్స్‌వ్యాగన్‌ ప్రతినిధులు తెలిపారు. గతంలో వెంటో కారుని ఎగుమతి చేయగా మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఇండియాలో టైగూన్‌ మోడల్‌లతో అమ్ముడవుతున్న కారుకి విదేశాల కోసం టీ క్రాస్‌ పేరుతో ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు. ఇండియలోని ప్లాంట్‌లో తయారైన కార్లు 61 దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. జర్మనీ ప్లాంట్లకు ఏమాత్రం తగ్గని క్వాలిటీతో ఇండియాలో కార్లు తయారు చేస్తున్నామన్నారు. 
 

చదవండి:కారు తయారీ దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top