లాభాలతో ప్రారంభమైన మార్కెట‍్లు

గురువారం రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట‍్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపడంతో సెన్సెక్స్ 405 పాయింట్లు లాభపడి 52,604 పాయింట్లతో ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 114 పాయింట్ల లాభాలతో 15,747 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇక ఐటీ కంపెనీలు క్యూ 1 ఫలితాలను ప్రకటిస్తుండడంతో టెక్ లాభాల బాట పట‍్టాయి. బ్యాంకింగ్, ఆటో మొబైల్ స్టాక్ సైతం లాభాల బాటలో కొనసాగుతున‍్నాయి. ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ,బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.