ముగింపులో అదర గొట్టిన మార్కెట్‌ | Sensex, Nifty ended in gains | Sakshi
Sakshi News home page

ముగింపులో అదర గొట్టిన మార్కెట్‌

Apr 1 2021 3:53 PM | Updated on Apr 1 2021 3:53 PM

Sensex, Nifty ended in gains - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  లాభాల్లోముగిసాయి.  కొత్త ఆర్థిక సంసంవత్సర ఆరంభంలోనే  భారీగా  ఎగిసిన  సూచీలు  ముగింపును కూడా  అదరగొట్టేశాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగినా వారాంతంలో పాజిటివ్‌గా ముగిసాయి. చివరి గంటలో  పుంజుకుని కీలక మద్దతు స్థాయిలకుఎగువన ముగియం విశేషం. సెన్సెక్స్‌ 520 పాయింట్లు ఎగిసి 50029వద్ద,నిప్టీ 177 పాయింట్లలాభంతో 14867 వద్ద  స్థిరపడ్డాయి.   దాదాపు అన్ని రంగాల  షేర్లు లాభాల్లో ముగిసాయి.  

ముఖ్యంగా  టాటా స్టీల్  6 శాతానికిపైగా ఎగిసింది. దీంతో సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్ తిరిగి లక్ష కోట్ల రూపాయలకు చేరింది. జూన్,2008 తర్వాత ఆ స్థాయి ధరకి చేరడంతో 12ఏళ్ల నాటి గరిష్టానికి షేరు చేరింది.ఆస్ట్రేలియాలోని సైబర్ సెక్యూరిటీ సంస్థ కొనుగోలుతో విప్రో షేర్లు దాదాపు 5 శాతం ర్యాలీ  అయ్యాయి. ఇండస్‌ఇండ్‌, కోటక్‌మహీంద్ర, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు, బజాజ్‌ ఫైనాన్స్‌,సన్‌ఫార్మ  టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి., మరోవైపు హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌ నెస్లే, టైటన్‌, టెక్‌ మహీంద్ర స్వల్పంగా నష్టపోయాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement