StockMarketOpening: దలాల్ స్ట్రీట్ రోరింగ్, లాభాల జోరు

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా లాభాల జోరు కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఐటీ, సిమెంట్ సహా అన్ని రంగాల షేర్లు లాభాల నార్జిస్తున్నాయి.
ఫలితంగా నిఫ్టీ18 వేలమార్క్‌ను దాటేసింది. ఈ ఏడాది ఏప్రిల్ తరువాత ఈ స్థాయికి చేరడం విశేషం. సెన్సెక్స్ కూడా 60500కు చేరువలో ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్ 362 పాయింట్లు ఎగిసి 60478 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 18050 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైటన్, దివీస్, టెక్ ఎం, విప్రో యాక్సిస్ బ్యాంకు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. సిప్లా, సన్ ఫార్మ, హెచ్‌సీఎల్ టెక్ మాత్రమే నష్టపోతున్నాయి.