StockMarketClosing: రోజంతా ఫుల్ జోష్, బ్యాంకులు, ఐటీ షైన్

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంనుంచీ పాజిటివ్‌గా ఉన్న సూచీలు రోజంతా అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి. చివరికి సెన్సెక్స్ 659 పాయింట్లు జంప్ చేసి 59688 వద్ద, నిఫ్టీ 174 పాయింట్ల లాభంతో 17799 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల నార్జించాయి. ఫైనాన్షియల్, ఐటీ షేర్ల జోరుతో సెన్సెక్స్ 59600 ఎగువకు చేరగా, నిఫ్టీ 17800 స్థాయికి చేరువలో ఉంది.
శ్రీ సిమెంట్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు హిందాల్కో, టాటాస్టీల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ నష్ట పోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పుంజుకుంది. 23 పైసలు ఎగిసి 79.71 వద్ద ఉంది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు