ఐటీ జోరు, లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ | Sensex jumps 250 pts InfosysTCS top gainers | Sakshi
Sakshi News home page

StockMarketOpening: ఐటీ జోరు, లాభాల్లో స్టాక్‌మార్కెట్‌

Oct 12 2022 10:47 AM | Updated on Oct 12 2022 12:58 PM

Sensex jumps 250 pts InfosysTCS top gainers - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  వరుస నష్టాలకు  చెప్పి లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే మార్కెట్లు 250 పాయింట్లకు పైగా ఎగిసాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 145 పాయింట్ల లాభంతో 57292 వద్ద,నిఫ్టీ 38 పాయింట్లు ఎగిసి 17022 వద్ద  టట్రేడ్‌ అవుతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 57, 200కి  ఎగువన, నిఫ్టీ 17వేలకు ఎగువన స్థిరంగా కొనసాగుతున్నాయి.  

ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ లాంటి ఇతర ఐటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. పవర్‌ గ్రిడ్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌​ ఆటో లాభపడుతుండగా,  ఆసియన్‌ పెయింట్స్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, భారతి  ఎయిర్టెల్‌, హీరో మోటోకార్ప్‌, డా. రెడ్డీస్‌ నష్టపోతున్నాయి.  అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా  కోలుకుంది. 14 పైసలు ఎగిసి 82. 20 వద్ద ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement