రికార్డు క్లోజింగ్‌, 18400ఎగువకు నిఫ్టీ | Sakshi
Sakshi News home page

StockMarket రికార్డు క్లోజింగ్‌, 18400 ఎగువకు నిఫ్టీ

Published Wed, Nov 16 2022 3:55 PM

Sensex and nifty record closing rises over100 pts  - Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు  లాభాల్లో ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి పుంజుకున్న సూచీలు  రికార్డు స్థాయిల వద్ద ముగిసాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 62వేల మార్క్‌ను తాకింది. సెన్సెక్స్‌ 108 పాయింట్ల లాభంతో 61980వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 18409 పద్ద పటిష్టంగా ముగిసాయి.

దాదాపు అన్ని  రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి.  ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్ల లాభాలు మార్కట్లకు ఊతమిచ్చాయి. అటు మెటల్‌ రంగ​ షేర్లు నష్టపోయాయి. కోటక్‌ మహీంద్ర,  కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌ భారీగా లాభపడ్డాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో  రూపాయి  81.30 వద్ద ముగిసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement