సెన్సెక్స్‌@ 38000- ఈ చిన్న షేర్లు భళా

Sensex @38,000- Mid small caps in demand - Sakshi

613 పాయింట్ల హైజంప్‌- 38,001కు సెన్సెక్స్‌

మధ్య, చిన్నతరహా కంపెనీల షేర్లకు డిమాండ్‌

జాబితాలో పీవీఆర్‌ లిమిటెడ్‌, మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌, టిప్స్

‌ శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌, ఐజీ పెట్రోకెమికల్స్‌, స్టెర్లింగ్‌ టూల్స్‌

ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో బుల్‌ జోరులో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 613 పాయింట్లు జంప్‌చేసి 38,001 వద్ద ట్రేడవుతోంది. తద్వారా 38,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం ఊపందుకోగా.. కొన్నిటిలో తగ్గింది. జాబితాలో పీవీఆర్‌ లిమిటెడ్‌, మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌, శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌, టిప్స్‌ ఇండస్ట్రీస్‌, ఐజీ పెట్రోకెమికల్స్‌, స్టెర్లింగ్‌ టూల్స్‌ చోటు సాధించాయి. ట్రేడింగ్‌ వివరాలు చూద్దాం..

పీవీఆర్‌ లిమిటెడ్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం దూసుకెళ్లి రూ. 1,234 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,242 వరకూ లాభపడింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.43 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3.48 లక్షల షేర్లు చేతులు మారాయి.

మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 1,848 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,880 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో  గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 16,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1700 షేర్లు మాత్రమే చేతులు మారాయి.

శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7.3 శాతం ర్యాలీ చేసి రూ. 357 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 372 వరకూ బలపడింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 6,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7,000 షేర్లు చేతులు మారాయి.

టిప్స్‌ ఇండస్ట్రీస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 295 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 11,200 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 20,400 షేర్లు చేతులు మారాయి.

ఐజీ పెట్రోకెమికల్స్‌
బీఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 317 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 11,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 28,500 షేర్లు చేతులు మారాయి.

స్టెర్లింగ్‌ టూల్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం ఎగసి రూ. 180 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 189 వరకూ లాభపడింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2,700 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో కేవలం 350 షేర్లు చేతులు మారాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top