Stock Market: Sensex up 240 points, Nifty closes around 18150 - Sakshi
Sakshi News home page

ఇన్పీ, రిలయన్స్ దన్ను, ఎనిమిదో సెషన్‌లోనూ లాభాలు

Published Tue, May 2 2023 6:00 PM

Sensex up 240 Nifty closes around18150 - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం వరుసగా ఎనిమిదో సెషన్‌లోనూ లాభాల్లో ముగిసింది. ఆరంభ లాభాలను కొనసాగించిన సూచీలు  రోజంతా  అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి. త్రైమాసిక ఫలితాలకు తోడు ఏప్రిల్‌లో జీఎస్టీ రికార్డ్‌ వసూళ్లు, వాహన విక్రయాల్లో జోరు, విమాన ప్రయాణాలు పుంజుకోవడం, తయారీ కార్యకలాపాలు నాలుగు నెలల గరిష్ఠానికి చేరడం వంటి పరిణామాలు మార్కెట్లకు ఊత మిచ్చాయి. (తీవ్ర ఇబ్బందులు: రెండు రోజులు విమానాలను రద్దు చేసిన సంస్థ)

ప్రధానంగా ఇండెక్స్ హెవీవెయిట్స్ ఇన్ఫోసిస్ ,రిలయన్స్ ఇండస్ట్రీస్‌లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 61,355 వద్ద,  నిఫ్టీ 83 పాయింట్లలాభంతో  18,147.65 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, మారుతీ, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, లార్సెన్ అండ్ టూబ్రో, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. (రెనాల్ట్‌ కైగర్‌ కొత్త వేరియంట్‌ వచ్చేసింది.. ఆర్‌ఎ‍క్స్‌జెడ్‌ వెర్షన్‌పై భారీ తగ్గింపు)

సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ నెస్లే నష్ట పోయాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే  దేశీయ కరెన్సీ రూపాయి  ఆరు పైసలు పతనమై 81.88 దగ్గర  ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!)

కాగా ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు ఏటా 12 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్లకు చేరుకుని, ఆల్‌టైమ్ నెలవారీ గరిష్ట స్థాయిని తాకినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాలను వెల్లడించింది. భారత్‌లో తయారీ కార్యకలాపాలు మరింత వేగవంతమై ఏప్రిల్‌లో నాలుగు నెలల గరిష్టాన్ని తాకాయి. 
 

Advertisement
Advertisement