ఉడాన్‌లో రెండో రౌండ్‌ కోతలు, భారీగా ఉద్యోగులపై వేటు | second round of announces 350 layoffs Udaan | Sakshi
Sakshi News home page

ఉడాన్‌లో రెండో రౌండ్‌ కోతలు, భారీగా ఉద్యోగులపై వేటు

Nov 5 2022 8:59 AM | Updated on Nov 5 2022 9:56 AM

second round of announces 350 layoffs Udaan  - Sakshi

న్యూఢిల్లీ: బీటూబీ ఈ-కామర్స్‌ వేదిక ఉడాన్‌ దేశవ్యాప్తంగా 300-350 మంది సిబ్బందిని తొలగించినట్టు సమాచారం. వ్యయ నియంత్రణలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. (బైజూస్‌ ఈఎఫ్‌ఏ ప్రచారకర్తగా ఫుల్‌బాట్‌ స్టార్‌ ప్లేయర్‌)

ఎంత మందికి ఉద్వాసన పలికిందీ వెల్లడించనప్పటికీ తాజా నిర్ణయాన్ని కంపెనీ నిర్ధారించింది. లేఆఫ్‌లపై ఉడాన్ ప్రతినిధి మాట్లాడుతూ ఉడాన్ లాభదాయకమైన కంపెనీగా ఎదుగుతున్న క్రమంలో  సామర్థ్యం పెంపుదల డ్రైవ్ , వ్యాపార నమూనాలో పరిణామం సిస్టమ్‌లోఎక్కువ పని అందుబాటులో లేనందున, కొన్ని ఉద్యోగాల అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైన సంస్థగా ప్రభావితమైన ఉద్యోగులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి కృషి చేస్తున్నట్టు ఉడాన్‌ ప్రతినిధి చెప్పారు.  కాగా ఈ రౌండ్ తొలగింపుల కారణంగా 1,000 మంది ఉద్యోగ నష్టాలు సంభవిస్తాయని  అంచనా.  మార్నింగ్ కాంటెక్ట్స్‌ ప్రకారం  ఉడాన్ జూన్ 2022లో 180 మంది ఉద్యోగులను తొలగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement