breaking news
Udaan
-
World Television Day: చిత్రలహరి వస్తుంది పద...
కొద్దిగా ఉన్నప్పుడే బాగుండేది. టీవీ ఉన్న ఇంటికి టీవీ లేని వాళ్లంతా వచ్చి కూచునేవారు. ఆదివారం రామాయణం కోసం ప్రతి ఇల్లూ ఆతిథ్యం ఇచ్చేది. చిత్రలహరికి గడప బయట నిలబడి తొంగి చూసే పిల్లల్ని అదిలించేవారు కాదు. ఇంటి పైన యాంటెనా, ఇంట్లో డయనారా అదీ హోదా అంటే. టెలివిజన్ జీవితంలో భాగం అయిన రోజులు బాగుండేవి. ఇవాళ జీవితమంతా టీవీగా మారి ఊపిరి సలపడం లేదు. టీవీ వచ్చిన రోజులకూ ఇప్పటికీ ఎంత తేడా!సినిమా తెర మీద కాకుండా మరో తెర మీద, అదీ ఇంట్లో ఉండే తెర మీద బొమ్మ పడుతుందని ఊహించని రోజుల్లో టెలివిజన్ వచ్చి చేసిన సందడి అంతా ఇంతా కాదు. నాటి హైద్రాబాద్, లేదా మద్రాస్ (చెన్నై), లేదా కొండపల్లి నుంచి సిగ్నల్స్ సరిగా ఆ రోజుకి అందాయో ఇక పండగే పండగ. ఎందుకు పండగ? సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు ఆ తెలుపు నలుపు టీవీలో ఏదో ఒకటి ఉచితంగా ప్రసారం అవుతూ ఉంటుంది. చూడొచ్చు. అందుకని.సమయం ఉన్న రోజులుమన దేశంలో 1959లో టెలివిజన్ మొదలైనా సరైన ప్రసారాలు రూపుదిద్దుకోవడానికి 1976కి కాని సాధ్యపడలేదు. నగరాలను దాటి ఊళ్లకు సిగ్నల్ అందే వ్యవస్థ ఏర్పడటానికి మరో పదేళ్లు పట్టింది. కలర్ ప్రసారాలు 1982లో మొదలైనా 1990లకు గాని కలర్ టీవీలు కొనే శక్తి ఊళ్లల్లో ఏ కొద్దిమందికో తప్ప అందరికీ రాలేదు. ఏతా వాతా 1985 నుంచి తెలుపు, నలుపు టీవీ ప్రసారాలు తెలుగు ప్రేక్షకులకు తెలుస్తూ వచ్చాయి. ఆ రోజుల్లో మనుషులందరి దగ్గరా ఎక్కడ లేని తీరిక, సమయం. కాబట్టి టీవీ ఆన్ చేసి అర్థమైనా కాకపోయినా చూస్తూ ఉండటం అలవాటుగా మారింది. ఇక అందులో ఆసక్తికరమైన కార్యక్రమాలు మొదలయ్యాక అతుక్కుపోయారు. టెలివిజన్ చేసిన మొదటి పని ఏమిటంటే– దేశ వాసులందరికీ ఒకే టీవీ ఒకే వినోదం అనే భావన కలిగించడం. ప్రాంతీయ ప్రసారాలు ఉన్నా ముఖ్యమైన మీట ఢిల్లీలో ఉంటుందని అందరికీ తెలియచేయడం. కేంద్ర శక్తిని స్థాపించడంలో టెలివిజన్ ముఖ్య పాత్ర పోషించింది.రామాయణం సంచలనం1987 నుంచి మొదలైన ‘రామాయణం’ సీరియల్ టెలివిజన్ పవర్ ఏంటో దేశానికి చాటింది. వ్యాపార ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియాలో వెల్లువెత్తడం కూడా మొదలయ్యాయి. అంతవరకూ టికెట్ ఇచ్చి సినిమా హాల్లో రామాయణం చూసిన జనం ఈ ఉచిత రామాయణాన్ని తండోపతండాలుగా చూశారు. ఆ తర్వాత ‘మహాభారత్’, ‘హమ్‌లోగ్’, ‘నుక్కడ్’, ‘ఉడాన్’, ‘మాల్గుడీ డేస్’... ప్రేక్షకులకు అందమైన డేస్ మిగిల్చాయి.చిత్రహార్–చిత్రలహరిప్రతి బుధవారం వచ్చే హిందీ పాటల ‘చిత్రహార్’, శుక్రవారం వచ్చే ‘చిత్రలహరి’ సూపర్‌హిట్ ఆదరణ పొందాయి. జనం తెలుగు పాటల కోసం టీవీల ముందు కొలువు తీరేవారు. ఆ రోజుల్లో ప్రతివారం ‘ఒక బృందావనం సోయగం’ (ఘర్షణ 1988) పాట తప్పనిసరిగా ఉండేది. పండగల ముందు ఆయా పండగలకు తగ్గట్టుగా పాటలు ఉండేవి. అదే సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ‘ఆనందో బ్రహ్మ’ సూపర్‌హిట్ అయ్యింది. ఆదివారం రోజు అతి పాత తెలుగు చిత్రం వచ్చినా జనం విరగబడి చూసేవారు.అపురూప క్షణాలుఇంటి పైనా యాంటెనా, ఇంట్లో టీవీ ఉండటం ఎంతో గొప్పయిన రోజులు అవి. ఇక కలర్ టీవీ ఉన్న ఇంటికి డిమాండ్ జాస్తిగా ఉండేది. వాన వచ్చినా, గాలి వీచినా నిలువని బొమ్మతో వేగినా అదే పెద్ద సంబరం. ఇన్స్టాల్మెంట్లో కొని ఇంటికి టీవీ తెచ్చిన రోజు పండగ ఉండేది. మధ్యతరగతి జీవులకు తగినట్టుగా ‘మినీ టీవీ’లు కంపెనీలు తెచ్చాక వాటితోనే సర్దుబాటు చేసుకున్న సన్నజీవులెందరో. దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్‌తో సహా దూరదర్శన్ అందరికీ అభిమాన పాత్రమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా సబ్‌టైటిల్స్‌తో చూసేవారు. అలా ఎన్నో ఉత్తర కన్నడ, తమిళ, మలయాళ సినిమాలు చూశారు. టీవీ ప్రసారాల వల్ల ఇరుగిల్లు పొరుగిల్లు ఒకే ఇల్లయినట్టుగా అందరూ కలిసి మెలిసి ఉండేవారు. టీవీలో క్రికెట్ లైవ్ చూడటానికి ఎంతో మంచిగా వ్యవహరించాల్సి వచ్చేది. స్నేహాలు చేయాల్సి వచ్చేది.ఇప్పుడు చేతిలో ఫోన్. అనుక్షణం రీల్స్. చేతిలోనే కదిలే బొమ్మ. దేనికీ విలువ లేదు. ఓటీటీల్లో వందల సినిమాలు ఉన్నా దేనిని ఎంపిక చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఏదీ నచ్చదు. కానీ ఆ రోజుల్లో వచ్చిందే నచ్చేది. అతిగా లభ్యమైనది ఏదైనా విలువ కోల్పోతుంది. ఇవాళ విజువల్ ఎంటర్టైన్మెంట్ వేయి రూ పాలు సంతరించుకున్నా, ఇరవై నాలుగ్గంటల న్యూస్ చానల్స్ ఉన్నా అవన్నీ జల్లెడలో జారే ఊకలానే ఉంటున్నాయి. టెలివిజన్ ప్రసారాల ప్రొఫెషనలిజమ్, హుందాతనం, ఆ న్యూస్‌రీడర్లు, ఆ యాంకర్లు... ఆ మాట... ఉచ్చారణ... పలుకు... ఇప్పుడెక్కడ. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయింది. -
రూ.2800 కోట్లు సమీకరించినా ఉద్యోగుల తొలగింపు.. కారణం ఇదేనా..
ఈ-కామర్స్ యునికార్న్ ఉడాన్ రూ.2800 కోట్ల మూలధనాన్ని సమీకరించిన తర్వాత తాజాగా 150 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ఉడాన్ తన సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి, తాజా నిధులతో ఇతర సంస్థలతో తమ భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రణాళిక వేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు కంపెనీలోని ఎఫ్ఎంసీజీ బృందం దేశవ్యాప్తంగా పనిచేసేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కానీ ప్రస్తుతం క్లస్టర్ వారీగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు కంపెనీ ఒక నివేదికలో తెలిపింది. కొన్ని సంవత్సరాలుగా స్థిరమైన వ్యాపారాన్ని నిర్మించడానికి భారీగా పెట్టుబడులు పెట్టామని, వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడానికి, స్థిరంగా వృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే అందులో భాగంగా కంపెనీ ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కంపెనీ తాజాగా నవంబర్‌లో రూ.990 కోట్లమేర కన్వర్టబుల్ నోట్లను సేకరించిన తర్వాత ఉడాన్ 10 శాతం ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. కంపెనీ కార్యకలాపాల్లో వస్తున్న మార్పుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2800 కోట్లమేర నిధులు సమీకరించింది. గతేడాది జూన్ నుంచి నవంబర్ వరకు 500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. ఇదిలా ఉండగా 2025లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)గా స్టాక్మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉడాన్‌ను 2016లో ముగ్గురు ఐఐటీ పూర్వ విద్యార్థులు అమోద్ మాల్వియా, సుజీత్ కుమార్, వైభవ్ గుప్తా స్థాపించారు. వీరు గతంలో ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేశారు. -
ఉడాన్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: బీటూబీ ఈకామర్స్ సంస్థ(ప్లాట్‌ఫామ్) ఉడాన్ తాజాగా 34 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,822 కోట్లు) సమీకరించింది. సిరీస్–ఈ ఫండింగ్‌లో భాగంగా ఎంఅండ్‌జీ పీఎల్సీ అధ్యక్షతన పలు పీఈ సంస్థలు పెట్టుబడులను సమకూర్చాయి. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, డీఎస్టీ గ్లోబల్ సైతం నిధులు సమకూర్చాయి. బిజినెస్ నిర్వహణకు అవసరమైన పూర్తిస్థాయి పెట్టుబడులను సమకూర్చుకోవడంతో రానున్న 12–18 నెలల్లో లాభాల్లోకి ప్రవేశించే లక్ష్యంతో సాగుతున్నట్లు ఈ సందర్భంగా ఉడాన్ తెలియజేసింది. ప్రస్తుత రుణాలను ఈక్విటీగా మార్పు చేయడంతోపాటు.. తాజా ఈక్విటీ జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టినట్లు వెల్లడించింది. వెరసి బ్యాలన్స్‌షీట్ పటిష్టంకానున్నట్లు పేర్కొంది. కస్టమర్ సేవలు, మార్కెట్ విస్తరణ, వెండార్ భాగస్వామ్యాలు, సరఫరా చైన్, క్రెడిట్ తదితరాలపై నిధులను వెచ్చించనున్నట్లు వివరించింది. -
చూడటానికి కిరాణా కొట్టు లాగే ఉంది.. నెలవారీ బిజినెస్ రూ.4 కోట్లకు పై మాటే
ఏ బిజినెస్ చేస్తే డబ్బులు బాగా సంపాదించొచ్చు. తక్కువ పెట్టుబడి. తక్కువ రిస్క్. మంచి ఇన్కమ్ కావాలి. ఏంటా బిజినెస్? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే నా లైఫ్ సెట్ అవుతుంది. నన్నెవ్వరూ ఆపలేరు. 24 గంటలూ పనిచేస్తా. తిండీ నిద్రా మానేస్తా. నాకీ ఒక్క ఆన్సర్ కావాలి. మీరూ ఇలా ఆలోచిస్తుంటే ఇది మీకోసమే. మీరెప్పుడైనా బెంగళూరు వెళ్లారా? వెళితే బెంగళూరులోని ఇందిరా నగర్ ‘రామేశ్వరం కేఫ్’ ను సందర్శించాల్సిందే. ఎందుకంటే ప్రపంచ దేశాల్లోని ఫుడ్ లవర్స్ ఈ కేఫ్‌లోని ఫుడ్ ఐటమ్స్‌ను అమితంగా ఇష్టపడతారు. చూడటానికి కిరాణా కొట్టులా? చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) పేరుతో ఈ కేఫ్‌లో నెలకు రూ.4.5 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇంతకీ ఈ కేఫ్ ఎవరిదో తెలుసా? రాఘవేంద్రరావు 20 ఏళ్లకు పైగా ఫుడ్ బిజినెస్‌లో అనుభవం ఉంది. ఆయన భార్య, సీఏగా విధులు నిర్వహిస్తున్న దివ్యా రాఘవేంద్ర రావులే ఈ కేఫ్‌ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ కేఫ్ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందుకు కారణం కేఫ్‌లో జరిగే బిజినెస్సే. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ‘కల, కల.. కలలు ఆలోచనలుగా మారితే.. ఆ ఆలోచనల్ని ఆచరణలో పెడితే అనుకున్న విజయం మీ సొంతం అవుతుంది.’ అని చెప్పిన మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే రాఘవేంద్రరావుకు అమితమైన ప్రేమ. ఆ ప్రేమతోనే కలాం జన్మించిన రామేశ్వరం ప్రాంతం పేరుతో ‘రామేశ్వరం కేఫ్’ పేరుతో బెంగళూరులో రెండు కేఫ్‌లను 2021లో ప్రారంభించారు. చదవండి👉 బ్యాంకుల్లో 'అన్క్లెయిమ్డ్ డిపాజిట్', అందులో పేరుంటే మీకే సొంతం.. చెక్ చేసుకోండిలా! మా లక్ష్యం అదే రామేశ్వరం కేఫ్‌లో దక్షిణ భారత రుచులను దేశం అంతా విస్తరించాలనేది మాలక్ష్యం. బెంగళూరుతో పాటు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, పూణె, అహ్మదాబాద్, ముంబై వంటి నగరాలతో పాటు రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉనికి చాటాలాని భావిస్తున్నట్లు రాఘవేంద్ర తెలిపారు. రామేశ్వరం కేఫ్‌లో దొరికే ఫుడ్ ఐటమ్స్ ఇవే వడ, మిని వడ,ఇడ్లీ, నెయ్యి..బటర్ ఇడ్లీ, నెయ్యి పుడి ఇడ్లీ,లెమన్ ఇండ్లీ, నెయ్యి సాంబార్ ఇడ్లీ, వెన్ పొంగల్,సక్కరై పొంగల్ తో పాటు ఇతర ఆహార పదార్ధాలను టేస్ట్ చేయొచ్చు. సుజిత్ కుమార్ నోటా రామేశ్వరం కేఫ్ మాట మార్కెట్‌ప్లేస్ ఉడాన్ సహ వ్యవస్థాపకుడు సుజిత్ కుమార్ ఇటీవల పాడ్‌కాస్ట్‌లో ఇదే కేఫ్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఆ పాడ్ కాస్ట్లో ఆయన మాట్లాడుతూ ‘రామేశ్వరం కేఫ్ యాజమాన్యం రోజుకు 7,500 మందికి సర్వ్ చేస్తుంటారు. కేఫ్ విస్తీర్ణం 10 బై 10 లేదా 10 బై 15 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. నెలకు రూ.4.5 కోట్లతో ఏడాదికి రూ. 50 కోట్ల వ్యాపారం చేస్తుంది. దాదాపు 70 శాతం గ్రాస్ మార్జిన్ పొందుతున్నారని అన్నారు. అంతే ఆ కేఫ్ గురించి తెలుసుకునేందుకు భోజన ప్రియులు ఉత్సాహాం చూపిస్తున్నారు. నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్లో ఇండియన్ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు కుమార్ నిఖిల్ కామత్ ‘డబ్ల్యూటీఎఫ్ ఈ-కామర్స్’ పేరుతో పాడ్ కాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం 3వ ఎపిసోడ్లో కిషోర్ బియాని (ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు), విదిత్ ఆత్రే (మీషో సహ వ్యవస్థాపకుడు), ఉడాన్ మార్కెట్‌ప్లేస్ ఉడాన్ సహ వ్యవస్థాపకుడు సుజీత్ కుమార్ ఈ ఎపిసోడ్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రిటైల్, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వ్యాపారం, దేశ విదేశాల్లో పెట్టుబడులు గురించి చర్చించారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
భారీ విస్తరణ ప్రణాళికల్లో ఉడాన్: ఏకంగా ఆరు రెట్లు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో శీతల పానీయాలకు డిమాండ్ పెరుగుతున్ననేపథ్యంలో తమ ఎఫ్ఎంసీజీ వ్యాపార విభాగాన్నిఆరు రెట్లు విస్తరించు కోవాలని బీ2బీ ఈ-కామర్స్ సంస్థ ఉడాన్ భావిస్తోంది. ఏడాది వ్యవధిలో 10,000 చిన్న పట్టణాలు, గ్రామాలకు చేరాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎఫ్ఎంసీజీ వ్యాపార విభాగం హెడ్ వినయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇందుకోసం ’ప్రాజెక్ట్ విస్తార్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్, జౌన్పూర్ జిల్లాల్లోసుమారు 3,000 మంది వరకు జనాభా ఉన్న గ్రామీణ మార్కెట్లలో దీన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌కి అనుగుణంగా వివిధ బ్రాండ్లకు సంబంధించి పలు చిన్న ప్యాక్‌ల నిల్వలను పెంచుకుంటున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కోకా-కోలా, పెప్సీకో, డాబర్, హెక్టర్ బెవరేజెస్ (పేపర్‌బోట్) వంటి కీలక బ్రాండ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు. -
ఉడాన్‌లో రెండో రౌండ్ కోతలు, భారీగా ఉద్యోగులపై వేటు
న్యూఢిల్లీ: బీటూబీ ఈ-కామర్స్ వేదిక ఉడాన్ దేశవ్యాప్తంగా 300-350 మంది సిబ్బందిని తొలగించినట్టు సమాచారం. వ్యయ నియంత్రణలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. (బైజూస్ ఈఎఫ్ఏ ప్రచారకర్తగా ఫుల్‌బాట్ స్టార్ ప్లేయర్) ఎంత మందికి ఉద్వాసన పలికిందీ వెల్లడించనప్పటికీ తాజా నిర్ణయాన్ని కంపెనీ నిర్ధారించింది. లేఆఫ్‌లపై ఉడాన్ ప్రతినిధి మాట్లాడుతూ ఉడాన్ లాభదాయకమైన కంపెనీగా ఎదుగుతున్న క్రమంలో సామర్థ్యం పెంపుదల డ్రైవ్ , వ్యాపార నమూనాలో పరిణామం సిస్టమ్లోఎక్కువ పని అందుబాటులో లేనందున, కొన్ని ఉద్యోగాల అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైన సంస్థగా ప్రభావితమైన ఉద్యోగులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి కృషి చేస్తున్నట్టు ఉడాన్ ప్రతినిధి చెప్పారు. కాగా ఈ రౌండ్ తొలగింపుల కారణంగా 1,000 మంది ఉద్యోగ నష్టాలు సంభవిస్తాయని అంచనా. మార్నింగ్ కాంటెక్ట్స్ ప్రకారం ఉడాన్ జూన్ 2022లో 180 మంది ఉద్యోగులను తొలగించింది. -
రెక్కల సివంగి
డిగ్రీ చదివితే చాలు అని ఆడపిల్లల గురించి అనుకునే రోజుల్లో పోలీస్ ఆఫీసర్‌గాఒక ఆడపిల్లను చూపించిన సీరియల్ ‘ఉడాన్’. మగవాళ్ల వ్యవస్థలో స్త్రీ సగౌరవంగాతన ఉనికిని చాటుకోవచ్చు అని చెప్పిన కథ ‘ఉడాన్’. పాటలు, ఏడుపుగొట్టు సన్నివేశాలు మాత్రమే హీరోయిన్‌కు దక్కే రోజుల్లో యువతుల ఆకాంక్షలకు రెక్కలు తొడిగి సాహస వనితలుగా ఉన్నతీకరించిన సంచలనం ‘ఉడాన్’. సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం.. అప్పుడప్పుడే స్త్రీ చదువు, ఉద్యోగం అంటూ ఇంటి గడప దాటి తన జీవితానికి ఓ దిశా దశ ఏర్పరుచుకుంటున్న కాలం. ఆకాశంలో సగం కోసం పోరాటం కాదు నేలమీదే తన ఉన్నతికి పాటుపడుతున్న సమయం. అలాంటి సమయంలో వచ్చింది ‘ఉడాన్’ సీరియల్. భారతదేశంలో మొట్టమొదటిసారి దూరదర్శ 1989లో మహిళా సాధికారితను ఓ సీరియల్ ద్వారా పరిచయం చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సీరియల్ ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎదుర్కొనే ఒత్తిళ్లు, సంఘర్షణ, సవాళ్లను చూపించడమే ధ్యేయంగా నడిచింది.‘ఉడాన్’ సీరియల్‌కి స్ఫూర్తి ఐపీఎస్ కాంచన్ చౌదరి భట్టాచార్య (మాజీ డీజీపీ). ఈమె ఇండియాలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ). కాంచన భట్టాచార్య తన వృత్తిలో చూపించిన నిబద్ధత, ఎదుర్కొన్న కష్టాలు సాధారణమైనవి కావు. ఈమె వాస్తవ కథే ‘ఉడాన్’ సీరియల్‌కి ప్రేరణ. కాంచన చౌదరి ఎవరో కాదు ఉడాన్ సీరియల్లో నటించిన కవితా చౌదరి అక్క. తన తోబుట్టువు సాహసం, కష్టాలు, ఎదుర్కొన్న ఒత్తిళ్లను చూసి, తెలుసుకున్న కవిత ఒక కథ రాసుకున్నారు. ఈ సీరియల్ దర్శకత్వ బాధ్యతలను తానే చేపట్టారు. అంతేకాదు, తన సోదరి నిజజీవితాన్ని హృద్యంగా చిత్రించి, బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు కవిత. ఇంటికి పెద్ద కొడుకులా! ఉడాన్ సీరియల్లో ప్రధానపాత్రధారి పేరు కళ్యాణీ సింగ్. ఒకసారి కళ్యాణి తండ్రి విక్రమ్ గోఖలే అనే వ్యక్తి వల్ల తన భూమినంతా కోల్పోతాడు. ఊళ్లో తన పరువు అంతా పోయిందని, తమకో కొడుకు ఉంటే ఇలా జరిగేది కాదని తండ్రితోపాటు కుటుంబం అంతా బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో కళ్యాణి తన తండ్రితో మహిళ ఏ విషయంలోనూ మగవాడికన్నా తక్కువ కాదని, సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో స్త్రీని ఉంచడమే తన లక్ష్యమని చెబుతుంది. తాను పోలీస్ అధికారినై కుటుంబానికి తిరిగి గౌరవాన్ని తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. అనుకున్నట్టుగానే పోలీస్ ఆఫీసరై తండ్రి కష్టాన్ని తీరుస్తుంది. అందరూ కళ్యాణీసింగ్ కుటుంబాన్ని గొప్పగా చూస్తుంటారు. ఏ లక్ష్యంతో అయితే ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరుతుందో ఆ దిశగానే నిబద్ధతతో పనులు చేస్తుంటుంది కళ్యాణి. ఐపీఎఎస్ అధికారిగా ఆమె చేపట్టిన ఎన్నో ప్రజాప్రయోజన పనులు అందరినీ ఆకట్టుకుంటాయి. వివక్షపై పోరాటం సమాజంలో లింగవివక్షపైనే కాకుండా రకరకాల సమస్యలపై పోరాడి గెలిచిన మహిళా పోలీస్ ఆఫీసర్ని ఈ షో చూపింది. పోలీస్ అంటే ప్రజల్లో ఉండాల్సింది భయం కాదు. ఒక స్నేహితుడిలా, తమను కాపాడే సంరక్షకుడిలా, పౌరులు గౌరవించే విధంగా ఉండాలని కోరుకుంటుంది కళ్యాణి. ఇదేవిధమైన సూచనలను పోలీసు అధికారులందరికీ ఇస్తుంది. ప్రతి పౌరుడు చట్టాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నాడో గమనిస్తుంటుంది. సమాజ కంటకులుగా మారినవారిని ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా శిక్షిస్తుంది. పోలీసు వ్యవస్థలో జరిగే లోటుపాట్లను సరిదిద్దుతుంది. మహిళలు కష్టపడి పనిచేయడానికి, తమ సొంత కాళ్ల మీద నిలబడగల సామర్థ్యం సాధించడానికి, సమాజంలో గౌరవం పొందడానికి, ధైర్యాన్ని నింపుకోవడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రజా పోలీసు ప్రజాదర్బారులో ఒక వ్యక్తి తన అభ్యర్థనను ఐఎఎస్, జిల్లా జడ్జిముందు ఉంచుతాడు. అతి తక్కువ సమయంలో అతనికి తగిన న్యాయం జరిగేలా చూస్తారు ఆఫీసర్లు. అందుకు చొరవ చూపిన పోలీస్ అధికారి కళ్యాణిని అందరూ అభినందిస్తారు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఆఫీసర్ల పాదాలు తాకి తన సంతోషాన్ని వ్యక్తం చేసే విధానం ప్రతి గుండెనూ కదిలిస్తుంది. అదే ఎపిసోడ్లో జిల్లా న్యాయవాది పీఏ రకరకాల బ్యూరోక్రటిక్ అడ్డంకులను ప్రదర్శించడానికి ప్రయత్నించినప్పుడు పోలీస్ అధికారిగా కళ్యాణీసింగ్ స్పందించిన విధానం ప్రజల్లోకి ఒక చిన్న సందేశాన్ని పంపినట్లుగా అవుతుంది. ఈ సందర్భంలో కళ్యాణీ సింగ్ ‘ మేం క్రమబద్ధమైన పద్ధతిలో పనిచేస్తాం. ప్రజలను నిరాశపరిచేలా, అడ్డంకులు సృష్టించే వారు ఎవరైనా సరే, వారిని క్షమించం’ అంటూ అతడిని జైలుకు పంపిస్తుంది.కళ్యాణీసింగ్ ఆదర్శాలు నచ్చిన ఐఎఎస్ ఆఫీసర్ శేఖర్ కపూర్ ఆమె మెప్పు సాధించడానికి, పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, తన ఆదర్శాలను ఆ ఆలోచన సరైనదో కాదో జాగ్రత్తగా అంచనా వేసే కళ్యాణి అంటే శేఖర్ అభిమానం చూపుతుంటాడు. సమాజంలో ప్రజలు అన్యాయానికి అడ్డుగా నిలబడే బలం ఉన్నప్పుడే న్యాయవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుందని అప్పుడే నిజమైన ప్రయోజనం పొందవచ్చనే సందేశాన్ని ఎపిసోడ్ చివరలో దర్శకుడు చూపించడంతో సీరియల్ ముగుస్తుంది. చివరి సన్నివేశంలో కల్యాణిసింగ్, ఆమె కుటుంబ సభ్యులు ప్రజలందరి మధ్య జరిగిన సమావేశానికి హాజరవడం, అందరూ కళ్యాణిని అభినందించడం, తర్వాత ఆమె తనకు కొత్తగా ఇచ్చిన పోస్టింగ్వైపు కదలడం చూపుతుంది. ఈ సమయంలో కళ్యాణిసింగ్ ఐపిఎస్ గురించి ఒక స్వరం ఆమె గొప్పతనం గురించి ప్రశంసిస్తుంది. మొత్తం ముప్పై ఎపిసోడ్లుగా వచ్చిన ఉడాన్ సీరియల్ నాటి తరం అమ్మాయిల్లో ధైర్యాన్ని, సాహసాన్ని పెంచింది. ఈ సీరియల్ వచ్చిన ఏడాదికే తెలుగులో విజయశాంతి పోలీసాఫీసర్‌గా నటించిన కర్తవ్యం సినిమా విడుదలైంది.– ఎన్.ఆర్ కవితా చౌదరి సర్ఫ్ డిటర్జెంట్ ప్రకటన ద్వారా నాడు చాలామందికి పరిచయమే. కవిత బాలీవుడ్ నటి, మోడల్ కూడా. దూరదర్శన్‌లో వచ్చిన ఉడాన్ సీరియల్లో ఐపీఎస్ ఆఫీసర్ కళ్యాణీసింగ్గా నటించింది. ఉడాన్ సీరియల్‌తో పాటు ‘యువర్ ఆనర్, ఐపీఎస్ డైరీస్’ అనే మరో రెండు టెలివిజన్ సీరిస్‌ను తీసింది కవిత. -
‘ఉదాన్’ వినోదం


