ఎంఎఫ్‌ల స్పాన్సర్లుగా పీఈ ఫండ్స్

బోర్డు సమావేశంలో సెబీ ఓకే
పలు ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)కు స్పాన్సర్లుగా వ్యవహరించేందుకు ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) ఫండ్స్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించింది. వీటిపై రూపొందించిన మార్గదర్శకాలకు బుధవారం సమావేశమైన సెబీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇ చ్చింది. దీంతో వ్యూహాత్మక మార్గదర్శకత్వం, నైపుణ్యాలను అందించేందుకు అవకాశముంటుంది. అంతేకాకుండా ఏఎంసీలు సొంత స్పాన్సరింగ్‌తో ఎంఎఫ్ బిజినెస్‌ను చేపట్టవచ్చు. తద్వారా ఎంఎఫ్ పరిశ్రమ మరింత విస్తరించేందుకు వీలుచిక్కనుంది. ఈ బాటలో సెబీ బోర్డు మరికొన్ని ప్రతిపాదనలను ఓకే చేసింది. వివరాలు చూద్దాం..
శాశ్వత డైరెక్టర్లకు చెక్
లిస్టెడ్ కంపెనీల బోర్డులో వ్యక్తులు శాశ్వత డైరెక్టర్లుగా వ్యవహరించేందుకు ఇకపై వీలుండదు. మెటీరియల్ ఈవెంట్లు, సమాచారంపై బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను(30 నిమిషాలలోగా), కంపెనీలో అమలయ్యే 12 గంటల్లోగా సమాచారం అందించవలసి ఉంటుంది. దీంతో కార్పొరేట్ సుపరిపాలనకు మద్దతు లభించనుంది. స్టాక్ బ్రోకర్లు అవకతవకలకు పాల్పడకుండా నిరోధించేందుకు మార్గదర్శకాలు మెరుగయ్యాయి. మార్కెట్లలో స్టాక్ బ్రోకర్లు మోసాలు, అక్రమాలకు పాల్పడకుండా తాజా నిబంధనలు అడ్డుకోనున్నాయి.
విజిల్ బ్లోవర్ పాలసీ, అంతర్గత నియంత్రణలపై సిస్టమ్స్ పర్యవేక్షణకు తెరతీయనున్నారు. అక్టోబర్ 1నుంచి సవరణలు అమలుకానున్నాయి. లిస్టెడ్ కంపెనీలు పర్యావరణం, సామాజిక, పాలనాపరమైన(ఈఎస్‌జీ) సమాచారమందించడంలో సరికొత్త నిబంధనలు అమలుకానున్నాయి. దీనిలో భాగంగా సెక్యూరిటీ మార్కెట్లలో ఈఎస్‌జీ రేటింగ్స్, ఎంఎఫ్‌ల ఈఎస్‌జీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వీలు చిక్కనుంది. దీంతో పారదర్శకత, సరళీకరణ, సులభ నిర్వహణలకు వీలుంటుంది.
సెకండరీలోనూ అస్బా
పబ్లిక్ ఇష్యూలలో మాదిరిగా సెకండరీ మార్కెట్లోనూ ఫండ్ బ్లాకింగ్(ఏఎస్‌బీఏ తరహా) సౌకర్యాలకు తెరలేవనుంది. ఇది అటు ఇన్వెస్టర్లు, ఇటు బ్రోకర్లు ఆప్షనల్‌గా వినియోగించుకోవచ్చు. ఫలితంగా బ్లాక్ చేసిన సొమ్మును మార్జిన్, సెటిల్‌మెంట్ ఆబ్లిగేషన్లకు మళ్లించవచ్చు. దీంతో సభ్యులకు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తగ్గే వీలుంది. తద్వారా స్టాక్ బ్రోకర్లు ఇన్వెస్టర్ల సొమ్మును అక్రమంగా వినియోగించుకోకుండా అడ్డుకట్ట పడనుంది. ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్‌లు) పెట్టుబడులకు స్వతంత్ర వేల్యుయేషన్ నిర్వహించుకోవచ్చు. ఏఐఎఫ్ మేనేజర్ల కీలక బృందం సమీకృత సరి్టఫికేషన్ తీసుకోవలసి ఉంటుంది.
మరిన్ని వార్తలు :